బడ్జెట్‌ రేంజ్‌లో రిలీజ్‌ అయిన Infinix Hot 20S.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

చైనీస్‌ మొబైల్‌ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ రిలీజ్‌ అయింది. అదే ఇన్ఫినిక్స్ హాట్ 20S. ఇప్పటికే బడ్జెట్‌ రేంజ్‌లో రిలీజ్‌ అయిన లేటెస్ట్‌ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కంపెనీ మొదట ఇన్ఫినిక్స్ హాట్ 20S(Infinix Hot 20S) పేరిట ఎంట్రీ లెవల్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఫిలిపిన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మీడియం రేంజ్ ఫీచర్స్‌తో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్20ఎస్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..!

ఇన్ఫినిక్స్ హాట్ 20S స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల IPS FHD+ డిస్‌ప్లే‌తో లభిస్తుంది.
గేమింగ్ స్పెసిఫిక్ ఫీచర్స్ కోసం డిస్‌ప్లే హైపర్ విజన్ గేమింగ్-ప్రో‌గా పనిచేస్తుంది.
ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G96 ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ రన్‌ అవుతుంది.
8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌ను MicroSD కార్డ్ సహాయంతో 512జీబీ వరకు ఎక్స్‌ప్యాండ్‌ చేసుకోవచ్చు.

కెమెరా క్వాలిటీ..

ఇమేజెస్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌‌తో పాటు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు రెండు ఉంటాయి.
ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. Infinix Hot 20S ఆండ్రాయిడ్ 12‌పై రన్ అవుతుంది.
18W టైప్-సి ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది.
ఫిలిపిన్స్‌లో లాంచ్ అయిన Infinix Hot 20S బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇన్ఫినిక్స్ హాట్ 20S ధర

బడ్జెట్ రేంజ్ ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్‌లో లాంచ్ అయింది.
8GB+128GB వేరియంట్‌ ధర ఫిలిపిన్స్ కరెన్సీలో PHP 8,499 (సుమారు రూ.12,300)గా కంపెనీ నిర్ణయించింది.
ఇన్ఫినిక్స్ హాట్ 20S స్మార్ట్‌ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
వైట్, పర్పుల్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్లు ప్రస్తుతం Shopeeలో కొనుగోలు చేయవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news