లాంచ్‌ అయిన Infinix ZERO 5G 2023.. ఫీచర్స్‌ అదుర్స్‌..

-

హాంకాంగ్‌ నుంచి మరో కొత్త 5G ఫోన్‌ లాంచ్‌ అయింది. హాంకాంగ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిక్స్ జీరో 5G’ పేరుతో మొట్టమొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా Infinix ZERO 5G 2023 మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ డివైజ్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ధర ఎంత?

కంపెనీ ఈ ఫోన్‌ ధర ఎంత అనేది ప్రకటించలేదు. అయితే ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఇన్ఫినిక్స్ జీరో 5G ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. దీనికి అప్‌గ్రేడ్‌గా వచ్చిన 2023 వెర్షన్ ధర దీనికంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చని టెక్కీస్‌ అంచనా..!
పంచ్-హోల్ డిస్‌ప్లేతో వచ్చే ఇన్ఫినిక్స్ జీరో 5G 2023 ఫోన్.. పెర్లీ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మెరైనర్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ డివైజ్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, క్వాడ్ ఫ్లాష్ ఉన్నాయి.
కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, రెండు 2MP సెన్సార్లు ఉన్నాయి.
ఈ లెన్స్ 4K వీడియోలను రికార్డ్ చేయగలవు. ముందు భాగంలో డ్యుయల్ ఫ్రంట్ ఫ్లాష్‌తో 16MP సెల్ఫీ కెమెరాను అందించారు.

ఫీచర్లు

ఇన్ఫినిక్స్ జీరో 5G 2023 ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,460 పిక్సెల్‌లు) IPS LTPS డిస్‌ప్లేతో వస్తుంది.
120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం.
ఆర్మ్ మాలి-G68 MC4 GPUతో లింక్ అయ్యే మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5G SoC చిప్‌సెట్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, Wi-Fi 6, 5G, FM రేడియో, బ్లూటూత్, GPS, OTG, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు దీంట్లో ఉన్నాయి.
33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 32 గంటల టాక్ టైమ్, 29 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది. ఈ స్టోరేజ్ సాయంతో ర్యామ్‌ను వర్చువల్‌గా 5GB వరకు విస్తరించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news