చైనాలో లాంచ్‌ అయిన రియల్‌మీ 10 ప్రో స్మార్ట్‌ ఫోన్..

-

రియల్‌మీ 10 సిరీస్‌లో కొత్త ఫోన్ అయిన రియల్‌మీ 10 ప్రో ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. డ్యూయల్ బ్యాండ్ 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 12 ప్రోతో ఈ ఫోన్ పోటీ పడనుంది. ఇవి రెండూ మనదేశంలో కూడా త్వరలోనే లాంచ్ కానున్నాయి. ఇంతకీ ఫోన్‌ ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..

రియల్‌మీ 10 ప్రో ధర..

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లు
అంటే మన కరెన్సీలో సుమారు రూ.18,500గా ఉంది.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను 1,899 యువాన్లుగా అంటే సుమారు రూ.22,000గా నిర్ణయించారు.
నైట్, ఓషన్, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది.

రియల్‌మీ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని పీక్ బ్రైట్‌నెస్ 680 నిట్స్‌గా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.76 శాతం కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

కెమెరా క్వాలిటీ.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news