జియో 5జీ ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్‌లో కనిపించింది. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ కానుందని అంచనా. 2022 జులైలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది వాయిదాలు పడుతూనే ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుందని వార్తలు వస్తున్నాయి.
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాను అందిస్తున్నారు. LS1654QB5 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ బీఐఎస్ డేటాబేస్‌లో కనిపించింది. ఇది మనదేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ కానుందని సమాచారం.
జియోఫోన్ 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన పని చేయనుందని తెలుస్తోంది.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.