ఒప్పో నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ లీక్.. ధర అంతేనా?

-

ప్రముఖ మొబైల్ కంపెనీలలో ఒకటి ఒప్పో.. ఈ కంపెనీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ కూడా మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దాని ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. మరి ఆలస్యం ఎందుకు త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఒప్పో 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము..మిడ్ రేంజ్‌లో ఏ సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ వచ్చింది. మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ఉంది. ఒప్పో ఏ77 5జీ త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. థాయ్‌లాండ్ ధర కంటే తక్కువకే లాంచ్ కావొచ్చు. 5000mAh బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే LCD డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ వస్తోంది.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు మరియు ధర..

ఒప్పో ఏ77 5జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. 90Hz రిఫ్రెష్ రేట్, 269 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డీసీఐ-పీ3 కలర్ గాముట్ కవరేజ్ ఉంటుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ రన్ అవుతుంది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్ ఉంటుంది. అయితే ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 5జీబీ వరకు వర్చువల్‌గా ర్యామ్‌ స్టోరేజ్‌ను పొడిగించుకునేందుకు వీలు ఉంది.

కెమరాల విషయాన్నికొస్తే.. సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి..వెనుక రెండు కెమెరాలతో కూడిన యూనిట్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను వివో ఇచ్చింది..ఇంకా ఇందులో డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ-సీ పోర్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ 190 గ్రాముల బరువును కలిగి ఉంది..

థాయ్‌లాండ్‌లో A77 5G మొబైల్‌ను లాంచ్ చేసిన ఒప్పో ధరను అధికారికంగా వెల్లడించలేదు. అయితే 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర 9,999 థాయ్ బట్‌లు అంటే మన కరెన్సీ లో దాదాపు రూ. 22 వేలకు పైగా ఉంటుంది.ఈ మొబైల్‌ త్వరలో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ధర మాత్రం అంతకంటే తక్కువే ఉండే ఛాన్స్ ఉండవచ్చునని అంచనా..

Read more RELATED
Recommended to you

Latest news