చైనాలో లాంచ్‌ అయిన హానర్‌ ఎక్స్‌ 40I స్మార్ట్‌ ఫోన్‌..!

-

చైనాలో హానర్‌ ఎక్స్‌ 40I స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. రూ. 20 వేల లోపులోనే ధర ఉంది. త్వరలో ఈ ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అవనుంది. ఈ ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.
హానర్ ఎక్స్40ఐ ధర..
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,599 యువాన్లుగా అంటే సుమారు రూ.19,000గా ఉంది.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ అంటే సుమారు రూ.21,350 ఉంది.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగానూ అంటే సుమారు రూ.23,700గా నిర్ణయించారు.
బ్లాక్, గ్రీన్, రోజ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
హానర్ ఎక్స్40ఐ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
పంచ్ హోల్ డిస్‌ప్లే, స్క్రీన్ టు బాడీ రేషియో 93.6 శాతంగా ఉంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.
ఇందులో 5 జీబీ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు.
అంటే మొత్తంగా 17 జీబీ ర్యామ్ ఈ ఫోన్‌తో పొందవచ్చన్న మాట.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.
40W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్40ఐ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, బైదు, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉండగా, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.
కెమెరా క్వాలిటీ..
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు..ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news