నేను లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా రాలేదు: గవర్నర్

-

భద్రాచలంలో భారీ వరదకు మునిగిన పంట పొలాలను పరిశీలించారు గవర్నర్ తమిళిసై. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అశ్వాపురం పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్, టార్పాలిన్స్, మెడిసిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజలకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చానన్నారు.దత్తత తీసుకున్న గిరిజన ప్రాంతాల పరిస్థితి తెలుసుకున్నానని,ముంపు గ్రామాలు సందర్శించి అర్జీలు తీసుకున్నానన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని కోరుతున్నారని తెలిపారు.గిరిజనులు శాశ్వత పరిష్కారం కోరుతున్నారని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయాలని సూచించారు.కొందరు ప్రజలు ఆందోళన లో ఉన్నారని, ఇండ్లు కావాలని అడిగారని తెలిపారు.వాళ్ళ ఫీలింగ్స్ ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు.తాను లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా ఇక్కడికి రాలేదని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news