లాంచ్‌ అయిన Realme C35 స్మార్ట్‌ ఫోన్.. బడ్డెట్‌ కాస్ట్‌లో బెస్ట్‌ ఫీచర్స్‌..!

-

Realme C35 స్మార్ట్‌ ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్. మూడు కెమరాలతో అదిరిపోయో ఫీచర్స్‌తో ఫోన్‌ విడుదలైంది. ఫీచర్స్‌, కాస్ట్‌, విశేషాలేంటో చూద్దామా..!

రియల్‌మీ సీ35 ధర..

ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు.
ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.

రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ UIR ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉంది.
ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను అందించారు.
128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.
దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా… బరువు 189 గ్రాములుగా ఉంది.
4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు

కెమెరా క్వాలిటీ..

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news