త్వరలో లాంచ్‌ కానున్న Realme GT Neo 3T స్మార్ట్‌ ఫోన్..

-

రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌ ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. అదే Realme GT Neo 3T. ఈ ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్లో ఎప్పుడో లాంచ్‌ అయింది. ఇప్పుడు భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Realme GT Neo 3T ధర..
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని కథనాలు వస్తున్నాయి. డ్యాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ రూ. 30వేల వరకూ ఉండొచ్చని అంచనా..!
రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గానూ ఉంది.
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది.
బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
0 నుంచి 80 పర్సెంట్ చార్జింగ్ అవ్వడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే పట్టనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
కెమెరా క్వాలిటీ..
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news