2023 డిసెంబరు నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలు

దేశ టెలికాం రకంలో కొత్త శకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దిల్లీలో ఇవాళ జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ -2022లో భాగంగా 5జీ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సహా పలువురు టెలికాం రంగ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముకేశ్ అంబానీ అన్నారు.

‘‘5జీ సేవలను మేం తీసుకొస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. టెలికాం రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చెయిన్‌, మెటావర్స్‌ వంటి 21వ శతాబ్దపు సాంకేతికతకు ఇదే పునాది కానుంది’’ అని ముకేశ్ అంబానీ తెలిపారు. దేశ ప్రజలందరికీ అందుబాటు ధరల్లో 5జీ సేవలను అందించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమవుతోందని అంబానీ తెలిపారు. 2023 డిసెంబరు నాటికి దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.