గుడ్ న్యూస్‌.. ఒకే వాట్సాప్ అకౌంట్‌.. ఇక 4 డివైస్‌ల‌లో..!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను త‌న యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే అనేక ఫీచ‌ర్లు ఇప్ప‌టికే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.

now multi device support available in whatsapp

మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నామ‌ని వాట్సాప్ గ‌తంలోనే ప్ర‌క‌టించింది. అయితే అలా ప్ర‌క‌టించి చాలా రోజులు అవుతున్న‌ప్ప‌టికీ ఆ ఫీచ‌ర్‌పై వాట్సాప్ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ను మ‌ళ్లీ చేయ‌లేదు. కానీ తాజాగా వాట్సాప్ బీటా వెర్ష‌న్‌కు వ‌చ్చిన అప్‌డేట్‌లో మ‌ల్టీ డివైస్ ఫీచ‌ర్‌ను అందించారు. ఈ క్ర‌మంలోనే వాట్సాప్‌ను ఏక కాలంలో 4 డివైస్‌ల‌లో వాడ‌వ‌చ్చు.

ఇంత‌కు ముందు వాట్సాప్‌లో ఒక అకౌంట్‌ను ఒకే డివైస్‌లో వాడాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక అకౌంట్‌ను 4 డివైస్‌ల‌లో వాడ‌వ‌చ్చు. అయితే ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్ష‌న్‌లోనే అందుబాటులో ఉంది. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది.

Read more RELATED
Recommended to you

Latest news