రూ.8,990కే ఒప్పో ఎ11కె స్మార్ట్‌ఫోన్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో.. ఎ11కె పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.2 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన వాట‌ర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 2 మెగాపిక్స‌ల్ కెమెరాను, ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. 4230 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు.

OPPO A11K smart phone launched in India

ఒప్పో ఎ11కె స్పెసిఫికేష‌న్లు…

* 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీడియో పి35 ప్రాసెస‌ర్
* 2జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయ‌ల్ సిమ్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఒప్పో ఎ11కె స్మార్ట్‌ఫోన్ ఫ్లోయింగ్ సిల్వ‌ర్‌, బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.8,990 ధ‌ర‌కు ఈఫోన్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో అమెజాన్‌లో ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news