Oppo F23: ఒప్పో నుంచి త్వరలో కొత్త ఫోన్‌ లాంచ్‌..

-

ఒప్పో లో F సిరిస్‌లో భాగంగా.. కొత్త ఫోన్‌ లాంచ్‌కు రెడీ అవుతోంది..ఒప్పో స్మార్ట్​ఫోన్స్​లో రెనో సిరీస్​కు మంచి డిమాండ్​ ఉంది. రెనో సిరీస్ పేరుతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తున్న ఒప్పో.. ఒప్పో రెనో 8 సిరీస్​ 2022లో లాంచ్​ అవ్వగా.. రెనో 9 సిరీస్​ ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. రెనో 8టీని.. ఎఫ్​23 పేరుతో ఇండియాలోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్టు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పటికే లీక్​ అయ్యాయి. లీకుల ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రముఖ టిప్​స్టర్​ పరాస్​ గుల్గాని ప్రకారం.. రెనో 8టీని.. ఎఫ్​23 5జీ పేరుతో ఒప్పో ఇండియాలో లాంచ్​ చేయనుంది. ఇందులో స్నాప్​డ్రాగన్​ 695 ఎస్​ఓసీ ఉంటుందని సమాచారం.. 67డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం లభిస్తుంది.

స్మార్ట్​ఫోన్​ డిజైన్​కి సంబంధించిన ఫొటోను కూడా లీక్​ చేశాడు పరాస్​ గుల్గాని. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న రెనో 8 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​కు.. దీనికి చాలా వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది.. రెనో 8టీలో సిలిండ్రికల్​ కెమెరా మాడ్యూల్​ ఉంది. మాడ్యూల్​లో రెండు పెద్ద సర్కిల్స్​ ఉన్నాయి. ఒకదాంట్లో సింగిల్​ కెమెరా, రెండో దాంట్లో డ్యూయల్‌ కెమెరాలు, ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఒప్పో రెనో 8టీ లేదా ఎఫ్​23 ఫ్రెంట్​లో కర్వ్​డ్​ డిస్​ప్లే ఉంది. టాప్​ కార్నర్​లో హోల్​- పంచ్​ కటౌట్​ కనిపిస్తోంది. మొత్తం మీద.. ఈ రెనో 8టీకి ప్రీమియం డిజైన్​ ఇచ్చినట్టు కనిపిస్తోంది.. ఇండియాలో ఎఫ్​23గా లాంచ్​ అయ్యే ఈ ఒప్పో రెనో 8టీకి సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాలేదు.. ధర, లాంచ్​ డేట్​, ఇతర ఫీచర్స్​పై స్పష్టత లేదు. అయితే.. త్వరలోనే ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతుందని స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి.. సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన ఒప్పో నుంచి వచ్చే ప్రతీ ఫోన్‌ యువతను ఆకర్షిస్తుంది. ఇక ఈ ఫోన్‌ ఎలా ఉంటుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news