ప‌బ్‌జి ప్రియుల‌కు పండుగే.. గేమ్ క‌మింగ్‌ సూన్ అంటూ ప‌బ్‌జి కార్ప్ టీజ‌ర్‌..!

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో ప‌బ్‌జి మొబైల్ గేమ్ భార‌త్‌లో ఇటీవ‌లే పూర్తిగా నిషేధ‌మ‌వ్వ‌గా ప‌బ్‌జి ప్రియులు ఎంతో విచారం వ్య‌క్తం చేశారు. గేమ్‌ను ఆడ‌లేక‌పోతున్నందుకు ఎంత‌గానో ఫీల‌వుతున్నారు. అయితే ప‌బ్‌జి కార్ప్ మాత్రం గేమ్‌ను ప‌బ్‌జి మొబైల్ ఇండియా పేరిట మ‌ళ్లీ భార‌త్‌లో అందుబాటులోకి తెస్తున్నామ‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. దీంతో ప‌బ్‌జి ప్రియులు ఆ గేమ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ప‌బ్‌జి కార్ప్‌.. ప‌బ్‌జి మొబైల్ ఇండియా అతి త్వ‌ర‌లోనే వ‌స్తుందంటూ ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. దీంతో ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

pubg corp launched teaser of pubg mobile india coming soon

ప‌బ్‌జి గేమ్ యాక్ష‌న్‌ను, పాన్ ఫైట్‌ను, చికెన్ డిన్న‌ర్‌ల‌ను మిస్ అవుతున్నారా ? అంటూ టీజ‌ర్‌లో చూపించారు. అలాగే ఇండియాలో ప‌బ్‌జి ఆడే ప‌లువురు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ల‌ను కూడా టీజ‌ర్‌లో చూపించారు. దీంతో ప‌బ్‌జి ప్రియులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు గేమ్ మ‌ళ్లీ అందుబాటులోకి వ‌స్తున్నందుకు వారు అమితంగా సంతోషిస్తున్నారు. అయితే ప‌బ్‌జి కార్ప్ టీజ‌ర్‌ను అయితే విడుద‌ల చేసింది కానీ.. గేమ్ ఎప్పుడు విడుద‌ల‌వుతుందో చెప్ప‌లేదు. కానీ అతి త్వ‌ర‌లోనే విడుద‌ల ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక ప‌బ్‌జి కార్ప్ సంస్థ ప‌బ్‌జి గేమ్‌ను ఇండియ‌న్ వెర్ష‌న్ రూపంలో లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇండియ‌న్ల‌కు స‌రిపోయే విధంగా గేమ్ ఉండ‌నుంది. అందులో దుస్తులు, ఇత‌ర అంశాలు అన్నీ కూడా భార‌తీయుల ఆచార వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన‌విగా ఉంటాయ‌ని ఇప్ప‌టికే ఆ సంస్థ ప్ర‌క‌టించింది. అలాగే గేమ్‌లో యూజ‌ర్ల డేటాను కూడా భార‌త్‌లోని స‌ర్వ‌ర్ల‌లోనే స్టోర్ చేస్తామ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో గేమ్ కోసం ప‌బ్‌జి ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి గేమ్ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.