ప‌బ్‌జి సైట్‌లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా గేమ్ లింక్ ప్ర‌త్య‌క్షం..!

-

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త్‌లో బ్యాన్ అయిన ప‌బ్‌జి మొబైల్ మ‌ళ్లీ ప‌బ్‌జి మొబైల్ ఇండియా పేరిట వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గేమ్‌కు అనేక మార్పులు చేసి మ‌ళ్లీ లాంచ్ చేయ‌నున్న‌ట్లు ప‌బ్‌జి కార్ప్ ప్ర‌క‌టించింది. దీంతో గేమ్ విడుద‌ల కోసం ప‌బ్‌జి ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప‌బ్‌జి మొబైల్ ఇండియా గేమ్ కు చెందిన ఏపీకే (గేమ్ ఫైల్) ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని చెబుతూ ఒక లింక్ తాజాగా ప‌బ్‌జి అధికారిక సైట్‌లో క‌నిపిస్తోంది.

pubg mobile india apk appears in pubg official site

ప‌బ్‌జి మొబైల్ అధికారిక సైట్‌లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా గేమ్‌కు చెందిన ఏపీకే ఇన్‌స్టాలేష‌న్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా గూగుల్ ప్లేలో గేమ్‌ను పొందండి.. అంటూ ఒక మెసేజ్ ద‌ర్శ‌న‌మిస్తోంది. అయితే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసినా ప్ర‌స్తుతానికి అది ప‌నిచేయ‌డం లేదు. కానీ గేమ్‌ను అతి త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌వ‌చ్చ‌ని, అందుక‌నే సైట్‌లో లింక్‌ను ఉంచార‌ని తెలుస్తోంది.

ఇక ఈ విష‌యం తెలిసిన ప‌బ్‌జి ప్రియులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప‌బ్‌జి మొబైల్ ఇండియా వ‌స్తుంద‌ని, అందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని, అందులో ఏముందో చూడాల‌ని ఆస‌క్తిగా ఉంద‌ని.. వారు కామెంట్లు పెడుతున్నారు. అయితే గేమ్ ఎప్పుడు లాంచ్ అవుతుంద‌న్న వివ‌రాల‌ను మాత్రం ప‌బ్‌జి కార్ప్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news