ప‌బ్‌జి ప్రియుల‌కు పండ‌గే.. నేడు ప‌బ్‌జి మొబైల్ ఇండియా గేమ్ లాంచ్‌..?

Join Our Community
follow manalokam on social media

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో నిషేధానికి గురైన ప‌బ్‌జి మొబైల్ తిరిగి భార‌త్ లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా పేరిట విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌బ్‌జి కార్ప్ ఇటీవ‌లే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. అయితే ఈ గేమ్ మంగ‌ళ‌వారం విడుద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప‌బ్‌జి కార్ప్ ఈ గేమ్ విడుద‌ల‌పై ఇటీవ‌లే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ గేమ్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తార‌నేది వెల్ల‌డించ‌లేదు. కానీ మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశంలో ఈ గేమ్‌ను లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది.

pubg mobile india game may launch today

ఇక గేమ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంద‌ర్భంగా ప‌బ్‌జి ప్లేయ‌ర్ల‌కు ప‌బ్‌జి కార్ప్ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉంది. గేమ్‌కు గాను భారీ ఎత్తున టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌నుంద‌ని తెలిసింది. అందులో రూ.6 కోట్ల వ‌ర‌కు ప్రైజ్ మ‌నీని ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. టైర్ 1 టీంల‌కు ప్ర‌త్యేకంగా రూ.40వేల నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రైజ్ మ‌నీ ఇస్తార‌ని తెలుస్తోంది. అలాగే వ్య‌క్తిగ‌త ప్లేయ‌ర్లు కూడా ఈ టోర్న‌మెంట్‌లో పాల్గొని బ‌హుమ‌తులు గెలుచుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని స‌మాచారం.

అయితే ఈ వార్త‌ల‌న్నీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌వే. కానీ దీనిపై ప‌బ్‌జి కార్ప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. అయితే నిషేధానికి గుర‌య్యాక గేమ్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుండ‌డంతో ప‌బ్‌జి ప్రియులు పండ‌గ చేసుకుంటున్నారు.

TOP STORIES

బన్నీ చేస్తున్న సాహసం మామూలుది కాదు..

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరిద్దై కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో మరీ ఎక్కువగా ఉన్నాయి....