జనసేనాని పవన్ కళ్యాణ్.. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎ టు అడుగు వేస్తే.. ఏమవుతుందోనని ఆయన హడలి పోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ఎన్నికలు ముం చుకొచ్చాయి. మరో ఐదు రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 1 న పోలింగ్ ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే.. తాను ముందు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రక టించారు. తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని కూడా అన్నారు. దీంతో ఏపీ జనాలు ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లోని 50 వార్డుల జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు.
ఇంతలోనే బీజేపీ అధిష్టానం నుంచి పవన్‌కు పిలుపు వచ్చింది. తమకు ప్రచారం చేయాలని వారు పవ న్‌ను కోరడంతో.. తాను స్వయంగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. బీజేపీకి ప్రచారం చేస్తానని మీడియాకు సైతం ప్రకటన ఇచ్చారు. ఇదంతా జరిగిపోయి పదిరోజులు అయింది. అయితే.. ఇప్పటి వరకు పవన్ ముందుకు అడుగు వేసింది లేదు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం తమకు పవన్ వస్తాడు.. ప్రచారం చేస్తాడు.. అంటూ.. చంకలు గుద్దుకుంటున్నారు. కానీ, పవన్ చుట్టూ ప్రచారం విషయంలో అనేక చిక్కుముడులు కనిపిస్తున్నాయి.
తాజాగా సీఎం కేసీఆర్ సైతం.. పవన్ పోయి పోయి.. బీజేపీకి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా నిరసించిన ట్టు సినీ వర్గాలు చెబుతున్నారు. తాజాగా కొందరు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. షూటింగ్ అనుమతుల విషయం సహా.. థియేటర్లలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించే విషయంపై ఆయనతో చర్చించారు. పన్నులు మినహాయించాలని కూడా వారు కోరారు. దీనికి కేసీఆర్ సై అన్నారు. ఈ సమయంలోనే ఆయన తన మనసులో ఉన్న మాటను బయటకు చెప్పారని అంటున్నారు. “మేం మీకు సహకరిస్తాం. మీ నుంచి కూడా మాకు సహకారం ఉండాలికదా.. మీకు మేం పనులు చేస్తుంటే.. మీరు అప్పోజిషన్ పార్టీలకు ప్రచారం చేస్తే ఎలా?“ అని పవన్‌ను దృష్టిలో పెట్టుకుని పరోక్ష వ్యాఖ్యలు చేశారట.
ఏతా వాతా ఇది పవన్ చెవిలో పడింది. దీంతో ఆయన ఇప్పుడు ప్రచారం చేయాలా? వద్దా? అని తల పట్టుకుంటున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడం గమనార్హం. బీజేపీకి తాను ప్రచారం చేయకపోయినా.. ఫర్లేదని.. సినీ ఇండస్ట్రీ విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి బాగున్న నేపథ్యంలో రాజకీయంగా ఆయనను విమర్శిస్తే.. ఇబ్బందేనన్నది పవన్ తాలూకు ఆలోచనగా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.