Realme GT Neo 5 5G.. క్షణాల్లో ఫోన్‌కు ఫుల్‌ ఛార్జ్‌..

-

Realme తన తర్యాతి ఫోన్ రియల్‌మీ జీటీ నియో 5ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది… ఈ మొబైల్ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ మొబైల్ ఫోన్‌లో స్పెషల్‌ ఫీచర్‌ ఏంటంటే.. ఇందులో 240W ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంది. ఈ మధ్య చాలా కంపెనీలు ఫోన్‌ ఛార్జింగ్‌పై ఫోకస్‌ చేస్తున్నాయి. ఎందుకంటే.. ఫోన్‌కు పూర్తిగా ఛార్జ్‌ అయిపోయే వరకూ.. ఎవరూ ఛార్జ్‌ పెట్టడం లేదు. పైగా ఛార్జింగ్‌ పెట్టి కూడా ఫోన్‌ వాడేస్తున్నారు.. ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్‌ అయితే కస్టమర్స్‌కు అంత యట్రాక్ట్‌ అవుతుంది.. అందుకే నిమిషాల వ్యవధిలోనే ఫుల్‌ ఛార్జ్‌ అయ్యేలా రూపొందిస్తున్నారు.. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. మ్యాగీ చేయడం కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ అవుతుంది..

ధర
Realme GT Neo 5 5G స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.38,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఏడు నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్..
మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సమయానికి సంబంధించి రియల్ మీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ 240W ఫాస్ట్ ఛార్జర్ కేవలం 7 నుంచి 8 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని నిపుణులు అంటున్నారు.. నిజానికి ఐకూ 10 ప్రో ప్రస్తుతం 200W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇది కేవలం 10 నిమిషాల్లో ఫోన్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.. కాబట్టి Realme GT Neo 5 దీని కంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరిలో చైనాలో లాంచ్ కానుంది. ఆ తర్వాత ఇది క్రమంగా ప్రపంచవ్యాప్త మార్కెట్లోకి వస్తుంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రోలో కూడా తక్కువే..
ఇటీవల షావోమి మార్కెట్లో రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ను విడుదల చేసింది. Redmi Note 12 Pro స్మార్ట్ ఫోన్‌లో 210W ఫాస్ట్ ఛార్జర్‌ను అందించనున్నారు. ఇది తొమ్మిది నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. Realme GT Neo 5లో 240W ఛార్జర్ అందుబాటులో ఉంటుంది. ఇది Redmi ఫోన్ కంటే వేగంగా ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంది.

స్పెసిఫికేషన్లు( అంచనా)..
రియల్‌మీ జీటీ నియో 5లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించినట్లు తెలుస్తోంది.
ఇది 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది.
స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అందించారు..
దీనిలో Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌ని పొందుతారు. 16 జీబీ ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news