షియోమీ నుంచి రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో..!

మొబైల్స్ త‌యారీదారు షియోమీ రెడ్‌మీ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ 10 ప్రైమ్ పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు.

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి88 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. స్టోరేజ్‌ను కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. అలాగే అద‌నపు మెమొరీ ఎక్స్‌పాన్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ర్యామ్‌ను మ‌రో 2జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఫొటోలు, వీడియోలు అద్బుత‌మైన క్వాలిటీతో వ‌స్తాయి.

రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను, ఒక మెమొరీ కార్డును వేసుకోవ‌చ్చు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క వైపున ఇచ్చారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా దీనికి ఫాస్ట్ చార్జింగ్, రివ‌ర్స్ వైర్డ్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తున్నాయి.

రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,499 ఉండ‌గా, 6జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,499గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 7వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.