రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫోన్‌ను లాంచ్ చేసిన షియోమీ.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

-

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో, త‌క్కువ ధ‌ర‌ల‌కే ఫోన్ల‌ను అందించ‌డంలో షియోమీ ఎంతో పేరుగాంచింది. ఈ క్ర‌మంలోనే ఆ సంస్థ అలాంటి ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌కే ఇంకో స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 10 ఎస్ పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Redmi Note 10S smart phone launched

రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫోన్‌లో 6.43 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 6జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మెమోరీని 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ను ఏర్పాటు చేశారు. హైబ్రిడ్ స్లాట్ కాదు. అందువ‌ల్ల రెండు సిమ్‌లు, మైక్రో ఎస్‌డీ కార్డుల‌ను వేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా దానికి తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఫోన్‌లో ముందు వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో ఏర్పాటు చేశారు. ఐఆర్ సెన్సార్ ఉంది. ఐపీ 53 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్‌సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి.

రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.14,999, 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.15,999గా ఉంది. అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్ లో ఈ ఫోన్ మే 18 నుంచి ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news