ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ చేసిన ఫొటో లేదా వీడియోను ఇలా రిస్టోర్ చేయండి..!

Join Our Community
follow manalokam on social media

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల‌లో మ‌నం స‌హ‌జంగానే త‌ర‌చూ ఫొటోలు, వీడియోల‌ను తీస్తుంటాం. కొన్నింటిని అవ‌స‌రం లేక‌పోతే డిలీట్ చేస్తాం. అయితే కొన్ని ఫొటోలు, వీడియోల‌ను పొర‌పాటున డిలీట్ చేస్తుంటాం. దీంతో బాధ ప‌డాల్సి వ‌స్తుంది. అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీరు గ్యాలరీ కోసం గూగుల్ ఫోటోస్ యాప్‌ను గ‌న‌క వాడుతుంటే డిలీట్ చేయ‌బ‌డిన ఫోటోల‌ను రిక‌వ‌రీ చేయ‌వ‌చ్చు. అదెలాగంటే…

restore deleted photos or videos in android in this way

ఆండ్రాయిడ్ యూజ‌ర్లు త‌మ ఫోన్ల‌లో గూగుల్ ఫొటోస్ యాప్‌ను వాడుతూ, సింక్‌ను ఆన్ చేసి ఉంటే గ‌న‌క వారు డిలీట్ చేసిన ఫొటోలు ఆ యాప్‌లోని ట్రాష్ అనే ఫోల్డ‌ర్‌లోకి వెళ్తాయి. అక్క‌డ అవి 60 రోజుల పాటు ఉంటాయి. ఆ త‌రువాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. క‌నుక ఆ లోపు వాటిని రిక‌వ‌రీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన స్టెప్స్‌ను పాటించాలి.

1. ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

2. కింది భాగంలో లైబ్ర‌రీ అనే ఆప్ష‌న్‌పై ట్యాప్ చేయాలి. త‌రువాత ట్రాష్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి.

3. ట్రాష్ ఫోల్డ‌ర్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు క‌నిపిస్తాయి.

4. మీరు కావాల‌నుకున్న ఫొటో లేదా వీడియోను రిక‌వ‌రీ చేసేందుకు దానిపై ట‌చ్ చేసి హోల్డ్ చేసి ప‌ట్టుకోవాలి. త‌రువాత కింది భాగంలో ఉండే రిస్టోర్‌పై ట్యాప్ చేయాలి.

5. దీంతో డిలీట్ అయిన ఫొటో లేదా వీడియో రీస్టోర్ అవుతుంది.

ఆ ఫోటో లేదా వీడియో మ‌ళ్లీ గూగుల్ ఫొటోస్ యాప్ లేదా లైబ్ర‌రీ యాప్‌లో క‌నిస్తుంది. అయితే మీరు డిలీట్ చేసిన ఫోటో లేదా వీడియో ట్రాష్‌లో కూడా లేక‌పోతే అది ప‌ర్మినెంట్‌గా డిలీట్ అయిన‌ట్లు లెక్క‌. క‌నుక అలాంటి వాటి ప‌ట్ల మ‌నం ఏమీ చేయ‌లేము.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...