శాంసంగ్ ఫోన్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై రెగ్యుల‌ర్ గా సెక్యూరిటీ అప్‌డేట్స్‌..

-

శాంసంగ్ సంస్థ‌కు చెందిన గెలాక్సీ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే మీకు ఆ కంపెనీ శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై ఆయా ఫోన్లు, ట్యాబ్లెట్ల‌కు త‌ర‌చూ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్ల‌ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

samsung announced to give security updates to its devices till 4 years

శాంసంగ్‌కు చెందిన కొత్త ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేసేవారికి డివైస్‌ల‌ను కొన్న తేదీ నుంచి 4 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్లు ల‌భిస్తాయి. సాధార‌ణంగా ఏ కంపెనీ అయినా స‌రే త‌మ ఫోన్ల‌కు ఒక ఏడాది వ‌ర‌కు మాత్ర‌మే ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్ల‌ను అందిస్తాయి. ఇక కొన్ని కంపెనీలు అప్‌డేట్స్‌ను అందివ్వ‌వు. అయితే శాంసంగ్ మాత్రం ఏకంగా 4 ఏళ్ల వ‌ర‌కు అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని తెలిపింది. దీంతో గెలాక్సీ సిరీస్‌లోని జ‌డ్‌, ఎస్‌, నోట్‌, ఎ, ఎం, ఎక్స్ క‌వ‌ర్ మోడ‌ల్ డివైస్‌ల‌ను వాడేవారికి ఇక‌పై ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ త‌ర‌చూ ల‌భిస్తాయి.

శాంసంగ్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఆ కంపెనీకి చెందిన సుమారుగా 130 మోడ‌ల్స్ కు చెందిన డివైస్‌ల‌ను వాడుతున్న వారికి ఉపయోగం క‌లుగుతుంది. ఇక త‌న కంపెనీకి చెందిన ఫ్లాష్‌షిప్ ఫోన్ల‌ను వాడేవారికి శాంసంగ్ ఇప్ప‌టికే 3 ఏళ్ల పాటు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news