జీర్ణ సమస్యలని దూరం చేసే ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..

-

జీర్ణ సమస్యలు కామన అయిపోయాయి. ఇవి ఇబ్బంది పెట్టడమే కాకుండా నొప్పిని కూడా కలుగజేస్తాయి. మనం తీసుకునే ఆహారాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆయుర్వేదంలోని కొన్ని నియమాలని పాటిస్తే బాగుంటుంది. మనం తినేతపుడు పాటించాల్సిన ఈ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు నిజంగా ఆకలి వేసినపుడే తినండి. ఆకలి వేస్తుందంటే దానర్థం ఇంతకుముందు మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయిందనే. కొన్ని ఆకలి వేసినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు నీళ్ళు తాగాలి. కావాల్సినన్ని నీళ్ళు తాగకపోయినా ఆకలి అయినట్టుగా ఉంటుంది. అందుకే ఏది ఆహార ఆకలి, ఏది నీటి గురించనేది స్పష్టంగా తెలుసుకోండి.

ప్రశాంతంగా కూర్చుని, ఏ పని పెట్టుకోకుండా తినండి. చేతిలో ఫోన్ పట్టుకుని, టీవీ ముందు కూర్చుని భోజనం చేయవద్దు.

సరైన క్వాంటిటీ తినండి. ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా జీవక్రియ, జీర్ణక్రియ ఉంటుంది. అవతల్కి వారిని చూసి మీరు కూడా అంతే తినాలని అనుకోకండి. మీ శరీరం ఎంత తింటే తృప్తి చెందుతుందో తెలుసుకోండి.

ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులకి దూరంగా ఉండండి. అప్పుడే వండిన వాటిని తినడం ఉత్తమం. దానివల్ల జీర్ణక్రియ వేగం బాగుంటుంది.

మీరు తీసుకునే ఆహారం మరీ పొడిగా ఉండకూడదు. పొడి ఆహారం తొందరగా జీర్ణం అవదు. అందుకే అన్నంలో కూర ఎక్కువగా కలుపుకోవాలని చెప్పేది.

రెండు వేరు వేరు రకాల ఆహారాలని ఒకే సరి తినవద్దు. పండ్లు తాగి, పాలు తాగడం, మాంసం తిని పాలు తాగడం చేయవద్దు.

తృప్తిగా భోజనం చేయండి. మీ ఐదు ఇంద్రియాలు భోజనాన్ని ఆస్వాదించాలి. అప్పుడే జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది.

అబ్బో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అంటే మాత్రం తొందర్లోనే జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదాన్ని కోరుకుంటున్నట్టే.

Read more RELATED
Recommended to you

Latest news