కేవ‌లం రూ.8,999కే శాంసంగ్ గెలాక్సీ M02s స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

-

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ M02s పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో గురువారం విడుద‌ల చేసింది. ఎమ్ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్ ల‌భిస్తాయి. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ పూర్తిగా ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. 5000 ఎంఏహ‌చ్ బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ల‌భిస్తుంది.

Samsung Galaxy M02s smart phone launched

శాంసంగ్ గెలాక్సీ M02s ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్
* 32/64 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ M02s స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్‌, రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.8,999గా ఉంది. అదే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర అయితే రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో విక్ర‌యిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news