ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌..!

-

ఎలక్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్.. గెలాక్సీ ఎం21 పేరిట భార‌త్‌లో బుధ‌వారం ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా 8, 5 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న మ‌రో రెండు కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. ఇక ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న మ‌రొక కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. అలాగే 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది.

Samsung Galaxy M21 smart phone launched in India

శాంసంగ్ గెలాక్సీ ఎం21 ఫీచ‌ర్లు…

* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డాల్బీ అట్మోస్‌, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌రను ఇంకా వెల్ల‌డించ‌లేదు. కాగా ఈ ఫోన్‌ను మార్చి 23వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news