యూట్యూబ్ క్రియేట‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. సూప‌ర్ థ్యాంక్స్ ఫీచ‌ర్ అందుబాటులోకి.. మ‌రింత‌గా ఆదాయం పొందే వీలు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ క్రియేట‌ర్ల‌కు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సూప‌ర్ థ్యాంక్స్ పేరిట ఓ మ‌నీ మేకింగ్ ఫీచ‌ర్‌ను కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన‌ట్లు తెలిపింది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూట్యూబ్ క్రియేట‌ర్లు మ‌రింత‌గా ఆదాయం పొంద‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం బీటా ద‌శ‌లో టెస్ట్ చేస్తున్నారు. అందువ‌ల్ల ప్ర‌స్తుతం బీటా క్రియేట‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. కానీ త్వ‌ర‌లోనే యూట్యూబ్ క్రియేట‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

గ‌తంలో సూప‌ర్ చాట్ ఫీచ‌ర్‌ను యూట్యూబ్ అందుబాటులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. స‌రిగ్గా సూప‌ర్ థ్యాంక్స్ ఫీచ‌ర్ కూడా అలాగే ప‌నిచేస్తుంది. సూప‌ర్ చాట్‌లో వీక్ష‌కులు ఎలాగైతే డ‌బ్బును డొనేట్ చేయ‌వ‌చ్చో సూప‌ర్ థ్యాంక్స్ ద్వారా కూడా డ‌బ్బును ఇవ్వ‌వ‌చ్చు. క‌నీసం 5 డాల‌ర్లు మొదలుకొని 50 డాల‌ర్ల వ‌ర‌కు గ‌రిష్టంగా ఇందులో క్రియేట‌ర్ల‌కు వ్యూయ‌ర్స్ డబ్బులు డొనేట్ చేయ‌వ‌చ్చు.

ఇక ఈ ఫీచ‌ర్ 68 దేశాల్లోని యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రాగా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ఇది ల‌భిస్తోంది. సూపర్ థ్యాంక్స్ ను కొనుగోలు చేసిన వారికి ప్ర‌త్యేక‌మైన యానిమేటెడ్ జిఫ్ ల‌భిస్తుంది. అలాగే ప్ర‌త్యేక బోనస్‌, కామెంట్లలో గుర్తింపు ల‌భిస్తాయి. 2017లో యూట్యూబ్‌లో సూప‌ర్ చాట్ ఫీచ‌ర్ రాగా 2019లో సూప‌ర్ స్టిక్క‌ర్స్ ను ప్ర‌వేశ పెట్టారు. ఇక ఇప్పుడు సూప‌ర్ థ్యాంక్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. మ‌రి ఇది యూజ‌ర్ల‌ను ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.