రూ.5 లతో 65 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్‌ బైక్‌!

గత ఏడాడి లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ల వైపే అందరు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది. కేవలం రూ.5 లతో 65 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్‌ బైక్‌ ఉటన్‌ ఎనర్జియా సంస్థ ప్రవేశపెట్టింది. ఇప్పటికే రోజుకొక కొత్త మోడల్‌ ఎలక్ట్రికల్‌ బైక్‌ లు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజీల్‌ ధరలు వల్ల ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌ కొనడానికి ఇషటపడుతున్నారు. దీంతో వాయు కాలుష్యం కూడా తక్కువ అవ్వడంతో ఈ వెహికిల్స్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరలో ఉటన్‌ ఎనర్జియా మార్కెట్లోకి ఓ కొత్త బైక్‌ ను విడుదల చేసింది.


అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడమే లక్ష్యంగా వాహనాలను రూపొందిస్తున్నాయి నగరానికి చెందిన పలు స్టార్టప్‌ కంపెనీలు. కేవలం ఒక గంటపాటు చార్జ్‌ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌ పై ప్రయాణించడానికి వీలవుతుందని అంటున్నారు సంస్థ ప్రతినిధులు. పొర్టీఫైవ్‌(Fortify)అనే పేరుతో మార్కెట్‌ లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ కి ఇప్పుడు ఆన్‌ లైన్‌ లో బుకింగ్స్‌ కూడా మొదలయ్యాయి. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్‌ ఒక్కసారి చార్జీ చేస్తే దాదాపు 65 – 70 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. చార్జీ చేయాడానికి కేవలం ఒక్కటి లేదా రెండు యూనిట్‌ కరెంటు మాత్రమే ఖర్చు అవుతుందని, అంటే కేవలం 5 రూపాయిల లోపే అన్న మాట.

ప్రస్తుతం మార్కెట్‌ లో అందుబాటులో ఉన్న ఏ బైక్‌ కూడా ఇంత సౌకర్యవంతంగా ఇంత తక్కువ ధరలో లేదని సంస్థ లోని ఈ బైక్‌ ను తయారు చేసిన హర్షవర్దన్‌ తెలిపారు. ఈ బైక్‌ టైర్లు మనం వాడే బైక్‌ టైర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అందువలన ఈ బైక్‌ ఎలాంటి ప్రతికూల మార్గాల్లో అయిన ఈజీ ప్రయాణించడానికి కుదురుతుందని తెలిపారు. పూర్తీ స్థాయి బ్యాటరీ బ్యాకప్‌తో వచ్చే ఈ బైక్‌ ప్రస్తుతం రూ. 35 వేలకు మార్కెట్‌ లో రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన వెబ్‌ సైట్‌ లో 9,999 రూపాయలు ఇచ్చి బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు సంస్థ ప్రతినిధులు. దీనికి ప్లగ్‌ అవసరం లేకుండానే మనం ఫోన్‌ చార్జింగ్‌ చేసుకునే సాకెట్‌ నుంచే సులభంగా చార్జ్‌ చేసుకోవచ్చు.