ఐఫోన్ వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఓఎస్ 13 అప్‌డేట్ వచ్చేసింది. ఆయా ఐఫోన్ల యూజర్లు ఈ నూతన ఓఎస్ అప్‌డేట్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐఫోన్ వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఓఎస్ 13 అప్‌డేట్ వచ్చేసింది. ఆయా ఐఫోన్ల యూజర్లు ఈ నూతన ఓఎస్ అప్‌డేట్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పలు నూతన ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ సారి వచ్చిన ఐఓఎస్ అప్‌డేట్ కేవలం ఐఫోన్లకు మాత్రమే లభిస్తోంది. త్వరలో ఐప్యాడ్ డివైస్‌ల కోసం ఐప్యాడ్ ఓఎస్‌ను కొత్తగా విడుదల చేయనున్నారు. ఇక ఐఓఎస్ 13లో ఉన్న టాప్ ఫీచర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఐఓఎస్ 13లో యూజర్లు తమ ఐఫోన్‌లో కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి అక్కడ ఉండే వైఫై లేదా బ్లూటూత్ ఐకాన్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే వారికి అందుబాటులో ఉండే వైఫై, బ్లూటూత్ నెట్‌వర్క్స్ కనిపిస్తాయి. వాటిల్లో వారు తమకు కావాలనుకున్న నెట్‌వర్క్‌కు తమ ఐఫోన్లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
2. ఐఓఎస్ 13లో సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్ పేరిట స్పామ్ కాల్స్‌ను నియంత్రించేందుకు ఫీచర్‌ను అందిస్తున్నారు. అందుకు గాను యూజర్లు ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్ విభాగంలో ఉండే సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే చాలు, ఇకపై టెలిమార్కెటర్ల నుంచి కాల్స్ వచ్చినా అవి ఆటోమేటిగ్గా సైలెంట్ అవుతాయి. మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
3. ఐఓఎస్ 13లో ఎంత పెద్ద సైజ్ ఉన్న యాప్‌నైనా యూజర్లు మొబైల్ డేటా ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఐట్యూన్స్ అండ్ యాప్ స్టోర్‌లో ఉండే మొబైల్ డేటా సెక్షన్‌లోని యాప్ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి ఆల్వేస్ అలో ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. డ్యుయల్ సిమ్ ఉన్న ఐఫోన్లు కలిగిన వారు ఫేస్‌టైం, ఐమెసేజ్ యాప్‌లలో ఫోన్‌లో ఉండే 2 ఫోన్ నంబర్లను ఇకపై ఐఓఎస్ 13లో ఉపయోగించుకోవచ్చు.
5. ఐఓఎస్ 13లో ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సఫారి విభాగంలో ఉండే క్లోజ్ ట్యాబ్స్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సఫారి బ్రౌజర్‌లో క్లోజ్ చేయకుండా ఉన్న ట్యాబ్స్ ఆటోమేటిగ్గా క్లోజ్ అయిపోతాయి.
6. ఐఓఎస్ 13లో యూజర్లు తమ ఐఫోన్‌కు బ్లూటూత్ మౌస్ కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. అందుకోసం యూజర్లు ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్సెస్సిబిలిటీ విభాగంలో ఉండే టచ్ సెక్షన్‌లోని అసిస్టివ్ టచ్-డివైసెస్-బ్లూటూత్ డివైసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లూటూత్ మౌస్‌ను పెయిర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డాంగిల్ అవసరం లేని బ్లూటూత్ మౌస్‌లనే ఈ విధానంలో ఉపయోగించుకోవచ్చు.
7. ఐఓఎస్ 13లో సఫారి ఇంటర్నెట్ బ్రౌజర్‌లో ఏదైనా వెబ్‌సైట్‌లో ఉండే ఫైల్స్‌ను యూజర్లు తమ తమ ఐఫోన్లలో నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలా డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్స్ ముందుగా ఐక్లౌడ్‌లో సేవ్ అవుతాయి. వాటిని అవసరం అనుకుంటే ఐఫోన్‌లోని ఫైల్స్ యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
8. ఐఓఎస్ 13లో పవర్, వాల్యూమ్ అప్ బటన్లను ఒకేసారి ప్రెస్ చేసి ఏదైనా వెబ్‌సైట్‌లో ఒక ఫుల్ వెబ్‌పేజీని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అది పీడీఎఫ్ ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. అయితే ఫేస్‌ఐడీ ఉన్న ఫోన్లలోనే ఈ విధానం సాధ్యపడుతుంది. అది లేని ఐఫోన్లలో పవర్, హోమ్ బటన్లను ఒకేసారి ప్రెస్ చేసి ఏదైనా వెబ్‌సైట్‌లో ఒక ఫుల్ వెబ్‌పేజీని స్క్రీన్‌షాట్ తీసుకోవాల్సి ఉంటుంది.
9. ఐఓఎస్ 13లో యూజర్లు తీసుకునే స్క్రీన్‌షాట్లు ఫైల్స్ యాప్‌లో ఫైల్స్ రూపంలో సేవ్ అవుతాయి. గ్యాలరీలో సేవ్ అవ్వవు.
10. ఐఓఎస్ 13లో యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోని మొబైల్ డేటా – మొబైల్ డేటా ఆప్షన్స్ విభాగంలో ఉండే లో డేటా మోడ్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఫోన్‌లో మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు.
11. ఐఓఎస్ 13లో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ చార్జింగ్ పేరిట అందిస్తున్న ఫీచర్ వల్ల యూజర్ల ఐఫోన్ల బ్యాటరీలు మరింత ఎక్కువ కాలం మన్నుతాయి.
12. ఐఓఎస్ 13లో ఐఓఎస్ కీబోర్డులో అందిస్తున్న ప్రత్యేక ఎమోజీ బటన్ వల్ల యూజర్లు ఇతరులకు చాలా సులభంగా ఎమోజీలను పంపుకునేందుకు వీలుంటుంది.
13. ఐఓఎస్ 13లో ఫైల్స్ యాప్‌లో జిప్ ఫైల్స్‌ను అన్‌జిప్ చేయవచ్చు. అలాగే సాధారణ ఫైల్స్‌ను జిప్ చేసుకోవచ్చు. అందుకుగాను యూజర్లు ఏదైనా ఫైల్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. అనంతరం వచ్చే కంప్రెస్ ఆప్షన్ ద్వారా ఫైల్స్‌ను జిప్, అన్‌జిప్ చేసుకునేందుకు వీలుంటుంది.
18. ఐఓఎస్ 13లోని ఫైల్స్ యాప్‌లో యూజర్లు నూతనంగా ఫోల్డర్లను క్రియేట్ చేసుకునే సదుపాయం కల్పించారు.
19. ఐఓఎస్ 13లో పీఎస్4, ఎక్స్‌బాక్స్ వన్ కంట్రోలర్స్‌కు సపోర్ట్‌ను అందిస్తున్న నేపథ్యంలో ఆయా కంట్రోలర్లను ఐఫోన్లకు కనెక్ట్ చేసుకుని వాటితో యూజర్లు మరింత సులభంగా గేమ్స్ ఆడుకోవచ్చు.
20. ఐఓఎస్ 13లో సెట్టింగ్స్‌లోని ప్రైవసీ విభాగంలో కొత్తగా చేర్చిన బ్లూటూత్ మెనూ ఆప్షన్ సహాయంతో యూజర్లు ఫోన్‌లో ఏయే యాప్‌లు బ్లూటూత్ ఉపయోగించుకోవాలో నిర్దేశించవచ్చు. దీంతో ఏయే యాప్‌లు బ్లూటూత్ వాడుకుంటున్నాయో ఇట్టే తెలిసిపోతుంది.