ఐఫోన్ 13 ఫోన్ల ధ‌ర‌లు భార‌త్‌లో ఎలా ఉన్నాయో తెలుసా ? ల‌భించేది ఎప్పుడంటే..?

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న కొత్త ఐఫోన్ల‌ను తాజాగా విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఐఫోన్ 13 మినీ, 13, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. అయితే భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర వివ‌రాల‌ను యాపిల్ వెల్ల‌డించింది. అవి ఇలా ఉన్నాయి.

these are the ipone 13 phones rates in india

ఐఫోన్ 13 మినీకి చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.69,900 ఉండ‌గా, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.79,900గా ఉంది. అలాగే 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.99,900గా ఉంది.

ఐఫోన్ 13 కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.79,900 ఉండ‌గా, 256జీబీ మోడల్ ధ‌ర రూ.89,900గా ఉంది. 512జీబీ మోడ‌ల్ ధర రూ.1,09,900గా ఉంది.

ఐఫోన్ 13 ప్రొ కు చెందిన 128జీబీ మోడల్ ధ‌ర రూ.1,19,900 ఉండగా, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,29,900గా ఉంది. 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,49,900గా ఉంది. 1టీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,69,900గా ఉంది.

ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్‌కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,29,900 ఉండ‌గా, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,39,900గా ఉంది. 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,59,900గా ఉంది. 1టీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,79,900గా ఉంది.

ఈ ఫోన్ల‌కు గాను సెప్టెంబ‌ర్ 17వ తేదీ నుంచి ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 24వ తేదీ నుంచి వీటిని విక్ర‌యిస్తారు.