యువ‌కుడి వేధింపులు త‌ట్టుకోలేక బాలిక ఆత్మ‌హ‌త్య‌..!

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకువ‌స్తున్నా మ‌హిళ‌ల‌పై వేధింపులు త‌గ్గ‌టం లేదు. సైదాబాద్ లో చిన్నారి పై జ‌రిగిన దారుణం మ‌ర్చిపోక ముందే యువ‌కుడి వేధింపులకు త‌ట్టుకోలేక ప‌దోత‌ర‌గ‌తి బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా కొముర‌వెల్లి మండ‌ల కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. మండంలోని బ‌త్తిని శ్రీనివాస్, బ‌త్తిని జ్యోతి దంప‌తుల కుమార్తె భార్గ‌వి ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతోంది.

కాగా కొముర‌వెల్లి గ్రామానికి చెందిన కుర్ర మ‌ధు అనే యువ‌కుడి వేధింపులు త‌ట్టుకోలేక మంగ‌ళ‌వారం భార్గ‌వి ఆత్మ‌హత్య చేసుకుంద‌ని త‌ల్లి దండ్రులు చెబుతున్నారు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో మంగ‌ళ‌వారం భార్గవి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. బాధితురాలి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.