ఫేస్ బుక్ మెసెంజర్‌ను ఢీ కొట్టిన టిక్ టాక్‌..

-

ఈ మ‌ధ్య కాలంలో చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎవరైనా గంటలు గంటలు ఒంటరిగా గడిపేస్తున్నారంటే.. టిక్ టాక్­లో దూరిపొయ్యారని అర్థం చేసుకోవాలి. అందులో వచ్చే 15 సెకండ్ల షార్ట్ వీడియో మెసేజ్‌లను చూస్తూ ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఓ వైపు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా.. ఉద్యోగాలు పోతున్నా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సెలబ్రిటీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు టిక్ టాక్ ఫేవరెట్ యాప్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సోషల్ మీడియా యాప్ తాజాగా ఫేస్ బుక్ మెసెంజర్ ను వెనక్కినెట్టింది.

సెన్సర్ టవర్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ 700 మిలియన్ల డౌన్ లోడ్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు రెండోస్థానంలో ఉన్న ఫేస్ బుక్ మెసెంజర్… టిక్ టాక్ ప్రభంజనంతో డీలాపడింది. కాగా, ఈ జాబితాలో ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ అగ్రస్థానంలో ఉంది. వాట్సాప్ 850 మిలియన్ డౌన్ లోడ్లతో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news