ట్విటర్‌ కొత్త ఫీచర్‌.. ఒకే ట్వీట్‌లో ఫొటో, గిఫ్‌, వీడియో

-

సోషల్‌ మీడియా యాప్‌లలో ట్విటర్‌ ప్రత్యేకం. ఇతర యాప్‌లలో మాదిరి ఇందులో పేరాలకు పేరాల సమాచారం టైప్ చేయలేం. ఒక ట్వీట్‌ 280 పదాలకు మించితే దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేయాల్సిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా నోట్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను ట్విటర్‌ పరిచయం చేయనుంది. అలానే ట్వీట్‌ తర్వాత దాన్ని ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఎడిట్‌ ట్వీట్ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటివరకు ఫొటో, వీడియో లేదా గిఫ్‌.. మూడింటింలో ఏదో ఒక మీడియా ఫైల్‌ను మాత్రమే టెక్ట్స్‌తోపాటు ట్వీట్‌ చేసే అవకాశం ఉంది. కొత్తగా రాబోతున్న ఫీచర్‌తో ఈ మూడు మీడియా ఫైల్స్‌ను ఒకేసారి టెక్ట్స్‌తోపాటు ట్వీట్‌ చేయొచ్చు. ఫొటో, వీడియో, గిఫ్‌ మూడింటిని కలిపి ట్వీట్ చేయొచ్చన్నమాట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలోని యూజర్స్‌తో పరీక్షిస్తున్నారు.
ఈ ఫీచర్‌తోపాటు ఫొటో డిస్క్రిప్షన్‌, కస్టమ్‌-బిల్ట్‌ టైమ్‌లైన్స్‌ పేరుతో కొత్త ఫీచర్లను కూడా ట్విటర్‌ పరీక్షిస్తోంది. ఫొటో డిస్క్రిప్షన్‌తో ట్వీట్‌లో పోస్ట్‌ చేసే ఫొటోకు సమాచారం యాడ్ చేయమని యూజర్‌కు గుర్తుచేస్తుంది. కస్టమ్‌-బిల్ట్‌ టైమ్‌లైన్స్‌తో ట్విటర్‌లో యూజర్ వెతికే సమాచారం, అనుసరించే ఖాతాల ఆధారంగా కంటెంట్‌ను చూపిస్తుంది. ఈ మూడు ఫీచర్లు పరీక్షల అనంతరం యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news