అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ‘ వివో యు 20 ‘

-

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్‌ సంస్థ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. యు సీరిస్‌లో భాగంగా యు 20 స్మార్ట్‌ఫోన్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేసింది. ఇది డిఫ‌రెంట్ వేరియంట్ల‌లో లాంచ్ చేసింది. రేసింగ్ బ్లాక్, బ్లేజ్ బ్లూలో 4జీబీ/64జీబీ స్టోరేజ్‌, 6జీబీ/ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్‌,18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి.

దేశీయంగా గ్రేటర్ నోయిడాలో యూ 20ను తయారు చేశామని వివో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌, వివో ఇ-స్టోర్లలో నవంబర్ 28 నుండి అందుబాటులోకి రానుందని వివో ఇండియా డైరెక్టర్ నిపుణ్‌ మారియా ఒక ప్రకటనలో తెలిపారు.

వివో యూ 20 ఫీచర్లు :
– 6.53 అంగుళాల ఫుల్‌హెచ్‌ఢీ స్క్రీన్
– క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాససర్‌
– 16+8+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
– 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
– 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు :
– 4జీబీ + 64జీబీ స్టోరేజ్‌ రూ.10,990
– 6జీబీ + 64జీబీ స్టోరేజ్‌ రూ.11,990

Read more RELATED
Recommended to you

Latest news