వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. వాట్సాప్ డీపీగా వీడియో

-

వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు గానూ కొత్త ఫీచర్స్ ని ప్రవేశ పెడుతూ వస్తుంది. రోజు రోజుకి దాని వాడకం పెరగడంతో ఇప్పుడు కొత్తగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుత౦ వాయిస్ వీడియో కాల్ లో ఒకేసారి 8 మంది మాట్లాడే విధంగా ఫీచర్ ని యాడ్ చేసింది సంస్థ. లాక్ డౌన్ లో వీడియో కాల్స్ ని ఎక్కువగా వాడటంతో ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది వాట్సాప్ డీపీగా 15 సెకన్ల వీడియో ని పెట్టుకునే ఫీచర్ ని యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దానికి ప్రొఫైల్ వీడియో అనే ఆప్షన్ ని జోడించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే బృందం పని మొదలుపెట్టింది అంటున్నారు. రెండు మూడు నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

ఇక స్టేటస్ లు ఇప్పుడు అపరిమితంగా పెట్టుకునే అవకాశం ఉంది వాటి సంఖ్యను తగ్గించే సూచనలు ఉన్నాయి. 15 కి మించి పెట్టకుండా ఉంచాలని సూచిస్తున్నారు. దీని వలన ఇతర యూజర్లు ఇబ్బంది పడుతున్నారని అందుకే తగ్గించాలి అని చూస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై యూజర్ల అభిప్రాయం కూడా తీసుకునే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news