ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ WhatsApp మరో నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘బిల్లీ ఎలిష్’ Billie Eilish . వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఎదో ఒక కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది. ఇటీవల ప్రైవసీ పాలసీ విషయంలో కూడా వాట్సాప్ వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. ‘బిల్లీ ఎలిష్’ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటికే గ్రూప్ చాట్లకు సంబంధించిన ఫీచర్‌తోపాటు డిసపియరింగ్ మెసేజెస్, ఇంకా ఇతర ఫీచర్లను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్లకు సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ నయా ఫీచర్ ద్వారా ‘హ్యాపీయర్ దెన్ ఎవర్’ అనే హాలీవుడ్ చిత్రంలోని సన్నివేశాలతో కూడిన స్టిక్కర్లను అందిస్తుంది. యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ రూపంలో ఉంటాయి.
ఈ స్టిక్కర్లలో 15 సెకన్ల నిడివితో ఉన్న జిఫ్‌లను చేర్చింది. యానిమేటెడ్’ స్టిక్కర్ ప్యాక్‌ను సాధారణ స్టిక్కర్ ప్యాక్ మాదిరి డౌన్లోడ్ చేయలేం. ఈ ఫీచర్‌ను కేవలం ప్రత్యేక లింక్ ద్వారానే స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అతి తక్కువ స్పేస్ ఉంటే సరిపోతుంది.
www.wa.me/stickerpack/HappierThanEver అనే లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత యాప్‌లోకి వెళ్లి, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక ‘హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్’ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్‌లో కనిపిస్తాయి. అప్పుడు వీటిని మీకు కావాల్సిన వారికి సులభంగా పంపించవచ్చు. అంతేకాదు వాట్సాప్ ఇటీవల మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డేలకు ప్రత్యేక స్టిక్కర్లను తీసుకొచ్చింది. వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే!