2020 నుంచి వాట్సాప్ ఈ ఫోన్లలో పనిచేయదు.. వాటిలో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి..!

-

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2020 ఫిబ్రవరి నెల నుంచి పలు ఫోన్లకు తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ జాబితాలో పలు ఆండ్రాయిడ్, ఐఫోన్లతోపాటు విండోస్ ఫోన్లు కూడా ఉన్నాయి. 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆండ్రాయిడ్ 2.3.7 ఓఎస్ ఉన్న ఫోన్లతోపాటు ఐఓఎస్ 7 ఉన్న ఐఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

whatsapp will not work in these phones from 2020 check if your phone is there

కాగా డిసెంబర్ 31, 2019 వరకు మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నందున అదే తేదీ నుంచి విండోస్ ఫోన్లకు కూడా వాట్సాప్ సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా ఫోన్లను వాడే వినియోగదారులు తమ ఫోన్లను కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.

అయితే విండోస్ ఫోన్లలో వాట్సాప్‌ను వాడుతున్నవారు తమ డేటాను బ్యాకప్ తీసుకునేందుకు వాట్సాప్ అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆ యూజర్లు తమ వాట్సాప్ డేటాను డిసెంబర్ 31వ తేదీ లోపు బ్యాకప్ తీసుకోవచ్చు. ఇక కై ఓఎస్ ఆధారిత జియో ఫోన్, జియో ఫోన్ 2లలో మాత్రం వాట్సాప్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వాట్సాప్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news