వ‌చ్చేస్తున్నాయ్‌.. రెడ్‌మీ కె40 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు..!

Join Our Community
follow manalokam on social media

షియోమీకి చెందిన రెడ్‌మీ కె సిరీస్ ఫోన్లు ఎంత‌టి సక్సెస్ ను సాధించాయో అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్ప‌టి కె సిరీస్ ఫోన్లు ఇప్ప‌టికీ చెలామ‌ణీలో ఉన్నాయి. త‌క్కువ ధ‌ర ఉండ‌డంతోపాటు ఫ్లాగ్‌షాప్ లాంటి ఫీచ‌ర్లను క‌లిగి ఉండ‌డంలో రెడ్‌మీ కె సిరీస్ ఫోన్ల‌కు ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక ఇదే కె సిరీస్‌లో త్వ‌ర‌లో కె40 ఫోన్లు రానున్నాయి. వాటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను షియోమీ యూజ‌ర్ల‌కు అందివ్వ‌నుంది.

xiaomi to launch redmi k40 series phones on february 25th

రెడ్‌మీ కె40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల‌ను ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు షియోమీ ప్ర‌క‌టించింది. ఈమేర‌కు షియోమీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ లు వెయిబింగ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చైనాలో ఈ ఫోన్ల ధ‌రలు రూ.33వేల నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిల్లో అధునాత‌న స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు.

రెడ్‌మీ కె40 సిరీస్ ఫోన్ల‌లో అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇవి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల డిస్‌ప్లే అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. వీటిల్లో 4000 ఎంఏహెచ్ క‌న్నా అధిక కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. అలాగే ఈ ఫోన్ల‌కు 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ను అందివ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్ల‌లో వెనుక భాగంలో 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. 12జీబీ ర్యామ్ ను అందించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ ఫోన్ల‌కు చెందిన మ‌రిన్ని స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...