గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ఉదయాన్నే రిషీ ధరణి దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ వదినా అంటాడు. ధరణి కాఫీ కావాలా అంటుంది. అంతకన్నా ముందు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి అని పెద్దమ్మ వసుధారతో ఏమంది అని అడుగుతాడు. వసుధార ఏం చెప్పింది అని ధరణి అడుగుతుంది. వసుధార ఏం చెప్పలేదు, తనతో అదే కదా సమస్య, ఒకవేళ పెద్దమ్మ ఏమైనా చెప్పినా..వసుధార సీరియస్ గా తీసుకోదు అంటాడు. నాకు ఈ ఇంట్లో విషయాలు పెద్దగా తెలియవు అంటూ ధరణీ కవర్ చేస్తుంది. సర్లే వదినా మీకేమైనా తెలుసేమో అని అడిగాను అంటాడు. ధరణి మనసులో వసుధారే చెప్పనప్పుడు నెనెలా చెప్తాను రిషీ..నిజం ఎప్పుడు తెలిసుకుంటావో అనుకుంటుంది.(అందరూ రిషీ నిజం ఎప్పుడు తెసుకుంటావో అనేవాళ్లే కానీ..ఎవ్వరు చెప్పరేంటో) రిషీ కూడా మనసులో ఈ పొగరేంటో ఏం అర్థంకాదు..అమ్మయిలంతా ఇంతేనా, వసునే ఇలా ఉంటుందా అనుకుంటుందా అనుకుంటాడు.
నెక్ట్స్ సీన్ లో కాలేజీలో అందరు మీటింగ్ కి అటెండ్ అవుతారు. మళ్లీ దామోదర్ వస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఎడ్యుకెల్చర్ డీటెల్స్ అన్నీ మీకు వివరిస్తాను అంటాడు. ఇంతలో ఫణీంద్ర ఈ ప్రాజెక్టు ఇంతబాగా వచ్చిందంటే దానికి నిజమైన కారణం మా జగతి మేడమ్ గారే అంటాడు. మహేంద్ర ఒక్కటే క్లాప్స్ కొడతాడు. అలా ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు. ఎడ్యూకల్చర్ అందరికి నచ్చేవిధంగా డిజైన్ చేస్తున్నాం అని జగతి అంటుంది. అలా అందరూ తాలోఓ మాట ప్రాజెక్టు గురించి అంటారు. రిషీ ప్రాజెక్టు గురించి వివరిస్తాడు. మనోడు చెప్పిన మాటలను మ్యూట్ చేస్తారు.. పైనల్ గా దామోదర్ వెరినైస్, వెరిగూడ్ అంటూ రిషీని పొగుడుతాడు. కొడుకుని పొగుడుతంటే జగతి ఆనందిస్తుంది. మహేంద్ర ఇంతలోనే పక్కనే ఉన్న జగతికి మెసేజ్ చేస్తాడు. థ్యాంక్యూ జగతి..రిషీ లాంటి గొప్ప కొడుకుని నాకు గిఫ్ట్ గా ఇచ్చావ్ అని. అలా మీటింగ్ అయిపోతుంది. అందరు సంతోషంగా కనిపిస్తారు.
మరోసీన్ లో ధరణి వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. దేవయాని వస్తుంది. అత్తయ్య గారు ఏమైనా కావాలా మీకు అంటుంది. దేవయాని అస్తమానం పనిచేస్తూనే ఉంటాం, కాస్త నీ బుర్రకు కూడా పనిపెట్టు, ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్లు ఏం చేస్తున్నారు అని..అర్థమవతుందా అంటే..ధరణి భలే దొరికారు అత్తయ్య అనుకుని మీరు వసుధారను మందలించారు కదా అప్పుడు నాకొక అనుమానం కలిగింది అంటుంది. నీ మట్టిబుర్రకు అనుమానం వచ్చిందంటే విశ్లేషించాల్సిందే ఏంటో చెప్పు అంటుంది. ధరణి..రిషీ గురించి వసుధారను తింటారేంటి, మీకు కోపం జగతిమీద కదా వసూని ఎందుకు అలా అన్నారు అని అఢుగుతుంది. దేవయాని ఏం మాట్లాడదు. చాల్లే పనిచూసుకో అని వెళ్లిపోతుంది.
కాలేజ్ లో రిషీ, వసుధార వాలంటీర్స్ తో ఆన్ లైన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్ అయిపోయాక..వసు రిషీవైపు అలా చూస్తూనే ఉంటుంది. రిషీ ఏం చూస్తున్నావ్ అంతలా అని అడుగుతాడు. మిమ్మల్నే సార్ అంటుంది వసూ. ఏదైనా ఒక పనిమొదలు పెడితే అందులో మునిగిపోతారు అంటూ రిషీకి బిస్కెట్లు వేస్తుంది. ఏంటి సన్మానసభ పెట్టేశావ్ పొగుడుతున్నావ్ అంటాడు. వసూ అలా ఏం లేదు సార్ అంటుంది. పొగుతూనే లేదంటావ్..అబద్ధాలు కూడా చెప్తున్నావా అంటాడు. వసూ నేను అసలు అబద్ధాలే ఆడను అంటుంది..ఇద్దరు మాట్లాడుకుంటారు.
మీరు ప్రాజెక్టు మీద శ్రద్ధ చూపిన తర్వాతే ప్రాజెక్టు సక్సస్ అయింది అంటుంది వసూ. నీకు లీవ్ ఏమైనా కావాలా అని అడుగుతాడు. అయ్యే లేదు సార్ అంటూ వసూ ఒట్టేయబోతుంది. రిషీ చేతులు వెనుకకు పెట్టేసుకుంటాడు. వసూ ఏమైంది సార్ అంటే..ఏమో అప్పుడు గిల్లి గిల్లొట్టు అన్నావ్..ఇప్పుడు కొట్టి కొట్టొట్టు అంటావ్ ఏమో అంటాడు. వసూ మనసులో రిషీ సార్ మంచి మూడ్ లో ఉన్నారు..ఇప్పుడే జగతి మేడమ్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి అనుకుంటుంది. రిషీ..నా లైఫ్ లో నా విజయాల వెనక ఒక స్త్రీ ఉన్నారు అంటాడు. ఇంతలో జగతి వస్తుంది. రిషీ రండి అంటాడు. వసూ మేడమ్ ఇప్పుడే సార్ మీ గురించి అని చెప్పబోతుంది. రిషీ వసుధార మేడమ్ వచ్చిన పనేంటో ముందు అదికానీ అంటాడు. జగతి నిన్న రిషీ ఇంట్లో మర్చిపోయిన పెండ్రైవ్ ఇస్తుంది. రిషీ థ్యాంక్స్ చెప్పి అక్కడ పెట్టండి అంటాడు.
రిషీ గతంలో వసూ పెండ్రైవ్ ఇచ్చిన సీన్ గుర్తుచేసుకుని..ఆలోచనలు, జ్ఞాపకాలు బ్రెయిల్ లో ఉండాలి మేడమ్, పెండ్రైవ్ లో కాదు అని వసుధార ఇందాక నేను ఎక్కడ ఆపాను అంటే..వసూ గుర్తుచేస్తుంది. ఆ స్త్రీ ఎవరో మీరు తెలుసుకోవాలి మేడమ్ అంటాడు. వసూ జగతి అనుకుంటుంది. జగతి వసూ అనుకుంటుంది. రిషీ బాల్యం గురించి చెప్తుంది. నా బాల్యం నాకు కొత్తగా ఉండేది. నా స్కూల్ డేస్ లో అన్నింటిలో విజయాలు సాధించేవాడని, నా ఉత్సాహానికి, విజయానికి, నా ఎదుగుదలకు మా అమ్మ కారణం అంటాడు. ఆ మాటతో జగతి పొంగిపోతుంది. కానీ రిషీ..మా పెద్దమ్మే నాకు అమ్మ అంటాడు. అంతే జగతి, వసూ ఏడుపు ముఖం పెడతారు. రిషీ ఇక పెద్దమ్మ గురించి పొగుడుతూ ఉంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.