గుప్పెడంతమనసు 268 ఎపిసోడ్: ప్రపంచానికి నన్ను నీ భార్యగా పరిచయం చేయమని అడిగిన జగతి..కాలేజ్ లో రిషీ వసూల రొమాన్స్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో స్టూల్ ఎక్కి రూంలో ఉన్న అమ్మాయితో వసూ మాట్లాడుతుంది. అలాంటి పిచ్చిపనిచేయకు బాటిల్ కిందపడేయ్ అంటుంది. ఇంకోవైపు రిషీ కూడా వేరే డోర్ దగ్గర తడుతుూ ఉంటాడు. అయినా పనవ్వదు. వసూకి డోర్ బోల్డ్ కనిపిస్తుంది. రిషీకి వసూ నేను తనను మాటల్లో పెట్టి డోర్ బోల్డ్ ఓపెన్ చేస్తాను..మీరు డోర్ తీయండి అంటుంది. వసూ అలానే మోటివేట్ మాటలు చెప్తూపైన లాక్ తీస్తుంది. లోపలకి వెళ్లి వసూ షీలా చెంపపగలుకొడుతుంది. రిషీ మీకు మేము అందరం ఉన్నాకదా..నీ పెద్దోళ్లతో మాట్లాడి మేము పరిష్కరిస్తాం కదా అంటాడు. జగతి కూడా కష్టాలొచ్చాయని ఇలాంటి పనిచేయకూడదమ్మా అంటుంది. రిషీ అందరూ క్లాస్ కి వెళ్లండి అని పంపిస్తాడు. వసూ చెయ్యి బెనికినట్లుఉంది. చూసుకుంటూ ఉంటుంది. రిషీ వసూ నువ్వు ఒకసారి నా క్యాబిన్ కి రా అంటాడు. వసూ నేనేమైనా ఎక్కువ చేశానా..ఇప్పుడే క్లాస్ పీకుతారేమో అనుకుంటుంది.

రిషీ క్యాబిన్ కి వెళ్లి షీలా అనే అమ్మాయిని వాళ్లింట్లో డ్రాప్ చేయాలని డ్రైవర్ కి చెప్తాడు. ఇప్పుడే జగతి మేడమ్ వసుధారగారు ఇదే మాట చెప్పారు అంటాడు డ్రైవర్. సరే డ్రాప్ చేసి వచ్చాక మెసేజ్ చేయమంటాడు. ఈ గురుశిష్యులు ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారే అనుకుంటాడు. ఇంతలో వసూ వస్తుంది. వసూకూడా షీలాని పంపిస్తున్నాం అని చెప్తుంది. నేను ఇప్పుడే డ్రైవర్ తో మాట్లాడాను అని రిషీ అంటాడు. నీ చెయ్యి ఎలా ఉంది అని అడిగితే..నా చేతికి ఏమైంది సార్ అంటుంది వసూ.రిషీ పక్కన కుర్చుని చేయి పట్టుకుని ఈ చేయికేనా నొప్పి అంటాడు. కొంచెం బెనికినట్లు ఉంది సార్, చిన్నదే అంటుంది. నీ చేయి చెప్పిందా నొప్పి చిన్నది అని రిషీ చూసి కట్టుకడతాడు. బ్యాక్ గ్రౌండ్ నీ చిత్రం చూసి సాంగ్ వేసుకుంటారు ఇక. రిషీ కళ్లలోకే చూస్తుంది వసూ..షీలాతో బాగా మాట్లాడావ్ అంటాడు రిషీ..మీరు కూడా బాగా టెన్షన్ పడ్డారు సార్..జంటిలెమెన్ సార్ మీరు అంటుంది. నువ్వు నాకు చాలానే పేర్లు పెట్టావ్ కదా. సీరియస్ సింహం, ప్రిన్స్, యముడు అని అంటాడు. ఆ చివరిది నేను పెట్టలేదు సార్, శిరీష్ తప్పుగా అని చెప్పబోతుంది. రిషీ సరే సరే అంటాడు. వసూ థ్యాంక్స్ చెప్తుంది. రిషీ చెల్లుకి చెల్లు, అదులుకి బదులు అంటాడు. వసూకి మొదట అర్థంకాదు. రిషీ గతంలో రెస్టారెంట్ లో జరిగింది చెప్తాడు. అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటావ్ అని అంటే బాల్యంలో సార్ అని చెప్తుంది.

ఆరోజు రాత్రి ఇంట్లో మహేంద్ర జగతి రావాలి అని మహేంద్ర ఏంటో ఉషారుగా అరుస్తాడు. జగతి కాఫీ తెస్తుంది. ఎప్పుడుచూసినా కాఫీనా స్వీట్స్ ఇవ్వు..గుడ్ న్యూస్ చెప్పబోతున్నా అని రేపు మీడియా వాళ్లు వస్తారు..మిషన్ ఎడ్యుకేషన్ గురించి కోట్లమందికి తెలుస్తుంది. అది నీ ఐడియాకదా..నా భార్య గొప్పతనం అందరికి తెలిసిందంటే అది నాకు గుడ్ న్యూసే కదా అంటాడు. నేను నీ భార్య అని తెలిసినప్పుడు కదా, నేను నీ భార్యను అని ప్రపంచానికి తెలియజేయగలవా అంటుంది జగతి. ఒకప్పుడు నేను చెప్తా అంటే నువ్వే వద్దన్నావ్ అంటాడు మహేంద్ర. ఇక వీళ్లు ఇద్దరు గతం గురించి మాట్లాడుకుంటారు. కాస్త ఓపిగ్గా ఉండు..మనకు మంచిరోజులు వస్తాయని నేను నమ్ముతున్నాను అంటాడు.

Guppedantha-Manasu,.jpg

ఇంకోవైపు రిషీ ఫణీంద్ర మాట్లాడుకుంటారు. ఇంట్లో సరదాగా నీతో 5 నిమిషాలు అయినా మాట్లాడాలి అనుకుంటా..కానీ మన టైమింగ్స్ యే కుదరవు అంటాడు. ఏం పెద్దనాన్న ఏమన్నా చెప్పాలా అంటాడు రిషీ.. ఫణీంద్ర ఏదోదో చెప్పి మనం గెలిచాక మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటాడు. ఇది నాకు ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా అంటాడు రిషీ..రేపు చానల్ ఇంటర్వూలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చెప్పో ఒక్కొక్క మాట చాలా బాధ్యతగా, హుందగా ఉండాలి అంటాడు. థ్యాంక్స్ పెద్దనాన్న నా మంచికోసమే చెప్తున్నారు అంటాడు. ఫణీంద్ర మా నాన్నగారు నాకు చెప్పింది నేను నీకు నీకు చెప్తున్నాను..గెలవటం గొప్పకాదు..ఆ గెలుపు నిలబెట్టుకోవటం గొప్ప అని కాలేజ్ మా నాన్నగారి ఆత్మ అంటూ గొప్పగా మాట్లడతాడు.

కట్ చేస్తే అందరూ డిన్నర్ చేస్తుంటారు. దేవయాని మహేంద్ర ఇంకా రాలేదా అని అడుగుతుంది. ఫణీంద్ర నువ్వు కాస్త ఆగు ఎప్పుడు చెప్పేదేగా..కాలేజ్ కి పెద్దఛానల్ వాళ్లు వస్తున్నారు. రిషీ గురించి. మిషన్ ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చెప్తారు. అంటే జగతి, వసుధార కూడా వస్తారా అంటుంది దేవయాని. జగతి లేకపోతే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు లేదుకదా, కాలేజ్ విషయాలు కుటుంబ విషయాలు కలపొద్దు అని చెప్తాడు. రిషీ సగంలోనే చేయి కడిగేసుకుంటాడు. ఏంటిది రిషీ అని ఫణీంద్ర అడిగితే నా భోజనం ముగిసింది అంటాడు. అలానే ఎపిసోడ్ కూడా ముగుస్తుంది. తరువాయిభాగంలో వసూ స్టూల్ మీద స్టూల్ వేసుకుని ఏదో బ్యానర్ కుడుతుంది. ఇంతలో రిషీ వస్తాడు. సార్ ఓకేనా ఇదంతా అంటుంది వసూ, అది ఓకే..కానీ నువ్వే నాట్ ఓకే అంటాడు. సార్ నేను మా ఊర్లో చెట్టు ఎక్కడంలో తోపుతురము అన్నట్లు చెప్తుంది. దెబ్బకి కిందపడుతుంది. రిషీ తన రెండు చేతులతో వసూని పట్టుకుంటాడు. మరన్ని వివరాలు రేపటిఎపిసోడ్ లో చూద్దాం.

– Triveni Buskarwothu