గుప్పెడంతమనసు 306 ఎపిసోడ్: రాత్రిపూట కాలేజ్ లో రిషీ వసూధారల ఆటలు..గెస్ట్ హోస్ లో రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ, జగతి కారులో వెళ్తూ ఉంటారు. వసూ టాపిక్ రిషీ తీస్తాడు. రిషీ నాకు వసుధార కావాలి మేడమ్ అంటాడు. జగతి షాక్ తో సార్ అంటుంది. ఐమీన్..నా ఉద్దేశం..తనొక ప్రత్యకమైన స్టూడెంట్, కాలేజ్ టాపర్, అలాంటివాళ్లు అరుదగా దొరుకుతారు, తను మన కాలేజ్ లో చదివి పాస్ అయి వెళ్లిపోవటం నాకు నచ్చటంలేదు..తను మన కాలేజ్ లోనే ఉండాలి, వసుధారను మన కాలేజ్ లోనే స్టాఫ్ గా ఉండిపోమని మీరే ఒప్పించాలి అంటాడు రిషీ. నేను ఈ విషయం అడగగలనేమో కానీ, బలవంతంగా ఒప్పించలేనేమో సార్ అంటుంది జగతి. ఈ విషయం అడగాలనుకుంటే…నేను అడగలగలను, ఫ్యాకల్టీ హెడ్ గా ఇది మీకు ఇస్తున్న భాద్యత అనుకోండి, తనని మీరే ఒప్పించాలి అంటాడు రిషీ. తనని మీరు ఒప్పించలేరా అని జగతి అంటే..మేడమ్ నేను మీకొక పని అప్పగించాను, మీరు ఆపనిలో ఉండండి, తనకి ఎన్ని పనులు ఉన్నా, కాలేజ్ లో పనిచేస్తూ..అన్నీ చూసుకోమనండి అంటాడు రిషీ. జగతి మనసులో తనని వదిలివెళ్లటం నీకు ఇష్టంలేదు..నీ మనసేంటో నాకు తెలుసు కానీ నువ్వు బయటపడవు అని అనుకుంటుంది.

ఇంకోవైపు మహేంద్ర, వసూ రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు అడిగిన గురుదక్షిణ నేను ఇవ్వలేనేమో అనిపిస్తుంది అని వసూ అంటుంది. మహేంద్ర అలా అనకు వసుధార, దాదాపు నువ్వు విజయం సాధించేవరకూ వచ్చావు, నీ ప్రయత్నలోపం ఏం లేదు, చెయ్యను అనకు వసుధార అంటాడు. శిరీష్ పెళ్లి విషయంలో రిషీ అపార్థం చేసుకున్నాడుకదా..ఆ విషయంలో నా వైపు నుంచి సారి చెప్తాడు మహేంద్ర. వసూ రిషీ సార్ మనసు స్పష్టంగా అర్థమవుతుంది సార్, కానీ ఆయన మనసులో ఏముందో ఒక్కోసారి ఏం అర్థంకావటంలేదు సార్ అని రిషీ గురించి చర్చించుకుంటారు. డ్యూీ టైం అయిందని వసూ ఇక లోపలికి వెళ్తాను అంటుంది. ఇంతలో జగతి, రిషీ ఒకే కారులో వస్తారు. ఆ సీన్ చూసి వీళ్లిద్దరూ షాకైతారు. మహేంద్ర వసుధార మనం ఏం చూస్తున్నాం అంటాడు. నాకు అదే అర్థంకావటంలేదు సార్ అంటుంది వసూ. మహేంద్ర జగతితో మీరేంటి ఇక్కడ, అలా కారులో అంటాడు. ఇంతలోనే రిషీ హలో డాడ్, మేడమ్ తో పాటు నేను కూడా వచ్చాను, నన్ను కూడా పలకరించొచ్చు అంటాడు. నాకు అర్థంకావటంలేదు అందుకే అంటాడు మహేంద్ర. ఇందులో అర్థంకాకపోవటానికి ఏముంది..నా కార్ పెద్దనాన్నకు ఇచ్చాను, నేను మేడమ్ కారులో వచ్చాను, మేడమ్ గారికి ఇబ్బంది అవుతుందంటే..నేను డ్రైవింగ్ చేశాను..అంతేకదా మేడమ్ అంటాడు. జగతి అంతే సార్ అని..మనసులో అమ్మరిషీ..నా చేతుల్లోంచి స్టీరింగ్ లాక్కోని, నా మీదకు నెడుతున్నావా, నువ్వు సామాన్యుడివి కాదు అనుకుంటుంది. మీరు ఇక్కడ ఉంటారని ఊహించలేదు డాడ్ అంటే..నువ్వు వస్తావని నేను కూడా ఊహించలేదు రిషీ అంటాడు మహేంద్ర.

రిషీ వసుధారతో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మేడమ్ గారిని రమ్మన్నాను అని లెటర్ ఇస్తాడు..వసూ ఏంటి సార్ అది అంటే..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు లీడర్ గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను, ఇది అపాయింట్ మెంట్ లెటర్, ఇది మేడమ్ గారి ముందు ఇద్దామనే రమ్మన్నాను అంటాడు. వసూ మరి వికాస్ అంటే..వికాస్ మేడమ్ గారి పనులు చూసుకుంటాడు, నువ్వు నా దగ్గర పనిచేయాలి, ప్రమోషన్ ఇచ్చాను, శాలరీ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి అని లెటర్ వసూకి ఇస్తాడు. అంతాచేసి మేడమ్ మీరు క్లియర్ కదా అని రిషీ జగతిని అడుగుతాడు. జగతి మనసులో అసలు నాకేం చెప్పి చేశావు, నన్ను ఏం అడిగివ్ అని,, నువ్వు ఇలా అడిగితే చెప్పక తప్పదుకదా అనుకుని హా ఓకే సార్ అంటుంది.

కారు కీ జగతికి ఇచ్చి డాడ్ వెళ్దామా అంటే హా అంటాడు. మహేంద్ర, రిషీ వెళ్లిపోతారు. జగతి వసూతో నేను రిషీ ఒకేకారులో వచ్చాం, నాకు చాలా ఆనందంగా ఉంది, నేనే డ్రైవ్ చేశాను..మధ్యలో ఏమైందో తెలియదు నన్ను దిగమని తనే డ్రైవ్ చేశాడు అని మహేంద్రవాళ్లు వెళ్లే కారు చూసి ఆ కారులో నేనెప్పుడు వెళ్తానో, ఆ కారులో ముగ్గురం కలిసి జోక్స్ చెప్పుకుంటూ ఎప్పుడు వెళ్తామో అంటుంది. వసూ ఏం మాట్లాడదు. ఏంటి వసూ ఏం అనటం లా. నాది అత్యాస కదా, ఎక్కువ ఆలోచిస్తున్నానా అంటుంది. లేదు మేడమ్ అంటుంది. జగతి ఇంటికి రమ్మన్నా..ఎగ్జామ్స్ తర్వాత ఫస్ట్ టైం డ్యూటీకి వచ్చాను మీరు వెళ్లండి అంటుంది. జగతి వెళ్తుంది.

కారులో వెళ్తున్న మహేంద్ర రిషీని చూస్తూ..ప్రపంచంలో ఎనిమిదో వింత కాకపోతే.జగతి కారులో రిషీరావడమేంటో, ఏంటో ఈ పుత్రరత్నం అస్సలు అర్థంకాడు., ఇక్కడ నా పరిస్థితే ఇలా ఉంది అంటే. జగతి ఎలా ఉందో..గాల్లో తేలిపోతుందేమో..అసలు రిషీ మనసులో మాట ఎప్పుడు చెప్తాడో, నేను ఎప్పుడు వినాలో అనుకుంటూ రిషీ వైపు చూస్తాడు. రిషీ ఏం డాడ్ అలా చూస్తున్నారు అంటాడు. ఎప్పుడూ ఒకేలా చూస్తే ఏం బాగుంటుంది రిషీ అందుకే ఈసారి అలా చూశాను అంటాడు మహేంద్ర. మీరు ఇలా కవర్ చేస్తే నమ్మేస్తా అనుకున్నారా అని మీరేమైన నన్ను అడగాలానుకున్నారా అని రిషీ అంటాడు. అదేం లేదు అని మహేంద్ర అన్నా..మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది బోల్డెన్ని ప్రశ్నలు ఉన్నాయని అంటాడు రిషీ. అయితే మచ్చుకు ఒకటి చెప్పు, నేను ఏం అడగాలి అనుకుంటున్నానో అంటాడు మహేంద్ర. ఫ్యాకల్టీ హెడ్ మేడమ్ కారులో ఎందుకు వచ్చాడు, ఎప్పుడు అలా రాలేదుకదా ఒకటి, వసుధారకు సడన్గా కొత్త అపాయింట్ మెంట్ ఎందుకు ఇచ్చాడు అంతేకదా డాడ్ అంటాడు. అలా కాకుండా అలానే అంటాడు మహేంద్ర. ఈ రెండు టాపిక్స్ లో నాకు పర్సనల్ ఇంట్రస్ట్ ఏం లేదు, అలా జరిగిపోయింది అంతే అనుకుంటూ మాట్లాడుకుంటారు. ఇల్లు వస్తుంది మహేంద్రను దిగమంటే అదేంటి నువ్వురావా అంటే..నేను రాను, కాలేజ్ లో చిన్న పనుంది, పెద్దమ్మకు చెప్పండి..నేను ఈరోజు కాలేజ్ గెస్ట్ హౌస్ లోనే ఉంటాను అంటాడు.

మహేంద్ర ఏదో పనిచెప్పి ఏకాంతాన్ని కోరుకుంటున్నావా రిషీ అనుకుంటాడు. కట్ చేస్తే రిషీ కాలేజ్ లో ఒక్కడే ఆడుకుంటాడు. వసూ గుర్తొస్తుంది. అసలు నేను వసూ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను, వసూ నన్ను డిస్టబ్ చేస్తుందా అనుకుంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో వసూ కూడా కాలేజ్ కి వస్తుంది. ఈ టైంలో ఎందుకు వచ్చావు అని రిషీ అంటే..అనుకోకుండా వచ్చాను సార్ అంటుంది. ఓహో అలా కూడా వస్తారా అని రిషీ అంటాడు. ఇద్దరు కలిసి బాస్కెట్ బాల్ ఆడతారు. కట్ చేస్తే తెల్లారి రిషీ జగతి ఇంటికి వెళ్లి వసూ కాలిపట్టీ జగతికి ఇస్తాడు. తనదే రాత్రి మర్చిపోయింది, మీరు తనని రాత్రుళ్లు ఒంటరిగా తిరగొద్దని చెప్పరా మేడమ్ అంటాడు. ఈ ఇగోమాష్టర్ వసూని ఇలా ఇరికించాడేంటో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news