గుప్పెడంతమనసు 327 ఎపిసోడ్: వసుధారను ఇంట్లోంచి పంపించేయమని జగతికి చెప్పిన ఇగోమాష్టర్..వినేసిన వసూ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్-వసుధార మాట్లాడుకుంటూ ఉండగా లోపల నుంచి మహేంద్ర, జగతి కలసి బయటకు వస్తారు. ఒకర్ని చూసి మరొకరు షాక్ అవుతారు. కాసేపు ఎవరికి డైలాగ్స్ ఉండవూ.. అందరూ షాక్ లో ఉంటారుగా.. గౌతమ్.. ఇది వసుధార ఇల్లు కదా మీరిక్కడ ఉన్నారేంటని మహేంద్రను అడుగుతాడు. మహేంద్ర సమాధానం చెప్పేలోగా..కార్లోంచి బయటకు వచ్చిన రిషి..డాడ్ మిషన్ ఎడ్యుకేషన్ పనులుంటే మాత్రం ఇంత టైమ్ వరకూ ఇక్కడే ఉండాలా అని అడుగుతాడు.. మిషన్ ఎడ్యుకేషన్ మీద డాడ్ కి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అని రిషి ఎటకారంగా అంటాడు. గౌతమ్ ఈసారి వచ్చినప్పుడు లోపలికి వస్తానులే అని వెళ్తాాడు. కారులోకి వచ్చి ఏంట్రా వాళ్లకి గుడ్ నైట్ చెప్పలేదు అంటే..నువ్వు చెప్పావుగా ఒకటికి రెండుసార్లు అని కారు తీస్తాడు రిషి. ఏంటి వసు రిషికి కోపం ఇంకా తగ్గలేదా అని జగతి అంటే… అంత ఈజీగా తగ్గిపోతే రిషిసర్ ఎందుకవుతారు అని వసు లోపలికి వెళ్తుంది. రిషీ మొండి అయితే..వసుధార జగమొండిలా తయారైంది అనుకుంటుంది జగతి.

రిషి ఇంట్లో:

మా పెద్దమ్మకి సారీ చెప్పాలని అడిగితే వసుధార సారీ చెప్పను అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు రిషీ… వసు ఇలా ఉండదు తనపై మేడం ప్రభావం ఉందేమో అని ఆలోచిస్తాడు.ఇంతలో మన గౌతమ్ వచ్చి…ఈ నైట్ చాలా అందంగా ఉందని గౌతమ్ అంటే ఈ ప్రకృతి కూడా అమ్మలాంటిదేరా… ఎప్పుడెలా మారుతుందో అని చెప్పలేం అంటాడు రిషి. నువ్వు సింపుల్ గా బా చెప్పావ్ అని.. నీకో గిఫ్ట్ తెచ్చా అన్న గౌతమ్ అంటే.. నువ్వు రావడమే సంతోషం ఇంకా బహుమతులేంటి అంటాడు రిషీ. గౌతమ్ ఇచ్చిన మౌత్ ఆర్గాన్ చూసి రిషి చాలా సంతోషిస్తాడు. నాకు ఇది ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా అంటే..బాల్యం గొప్పతనం అదేకదరా అని… ఇది నువ్వు బాగా ప్లే చేస్తావ్, నాకు నేర్పమంటే నేర్పలేదు అందుకే ఇది నీకు ఇష్టమని బాగా గుర్తుంది అంటాడు గౌతమ్..ప్లే చేయ్ రా వినాలని ఉంది అని గౌతమ్ అడగటంతో.. రిషీ వసుధారతో గడిపిన క్షణాలు గుర్తుచేసుకుని మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తాడు. మౌత్ ఆర్గాన్ సౌండ్ విని రిషిని చూసిన మహేంద్ర..ఈ పాట దారి తప్పిన మనసు పాటా, ఇది ఆలోచనలా, ఇది నీ బాధా-నీ భావనలా ఏంటి రిషీ నువ్వెప్పుడు నీకు అర్థమవుతావ్ అనుకుంటాడు.

సీన్ కట్ చేస్తే తెల్లారుతుంది..మహేంద్ర ధరణీ దగ్గరకు వచ్చి..రిషికి నిజం చెప్పాలి అందుకు నీ సహాయం కావాలని అడుగుతాడు మహేంద్ర. మీరే చెప్పడానికి వెనుకా ముందు అవుతున్నారు.. మరి నా వల్ల అవుతుందా అంటుంది ధరణి. నేను చెప్తే..వసుధారకు సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నాడమ్మా..వదినకు దెబ్బలు ఎలా తగిలాయో..నవ్వే రిషీకి అర్థమయ్యేలా చెప్పాలి.. నిజా నిజాలేంటో రిషికి నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి. చూడ్డానికి చిన్న విషయమే అయినా వసు-జగతి-రిషి ముగ్గుర్నీ ఇబ్బంది పెడుతోంది ఈ విషయం. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా రిషీ కిందకు దిగుతాడు. జరిగిందేంటో అత్తయ్యగారు తన నోటితో చెబితేనే రిషి నమ్ముతాడేమో అంటుంది ధరణి. ఇంతలో ఎదురుగా ఉన్న రిషిని చూసి షాక్ అయిన ధరణి..మహేంద్రకి సైగ చేస్తుంది. అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు రిషి. రిషీ విన్నాడంటారా మావయ్యగారు అని ధరణి అడిగితే..విన్నా బాగుండేదేమో కనీసం ఈ రకంగానే నిజం తెలిసేది అనుకుంటాడు.

జగతి ఇల్లు:

జగతి-వసు ఎవరిపనుల్లో వారుంటారు. వసూ ఇంకా రెడీ కూడా అవ్వదూ..తల ఆరబెట్టుకుంటుంటేనే… బయట రిషీ కార్ హారన్ వినిపించడంతో వసూ కంగారుగా బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది. జగతి..కాఫీ తాగమన్నా తాగకుండా, టిఫిన్ కూడా తినదు. జగతి రిషీని నువ్వు రమ్మన్నావా.. ఫోన్ చేశావా అని జగతి అంటే..లేదు మేడమ్ అంటుంది వసూ. మరి ఎందుకు వచ్చినట్లు అని జగతి అడిగితే..వర్షం ఏమన్నా చెప్పి వస్తుందా రిషీ సార్ కూడా అంతే..బహుశా సారీ చెప్పించుకోవాలని వచ్చారేమో..సార్ కి లేట్ అయితే కోపం వస్తుంది అని.. వసు పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వెళ్తుంది. రిషీ మాట్లాడాలి..ఇక్కడ కాదు ఎక్కడికి అని అడగకు నాతో రావాలని అడిగితే సరే అంటుంది వసుధార. వీళ్లిద్దర్నీ చూసిన జగతి… ఏంటీ వసు.. అప్పుడే రిషిపై కోపం చూపిస్తుంది అప్పుడే పెరిగెత్తుకు వెళుతుందని అనుకుంటుంది.

మహేంద్ర-గౌతమ్:

మహేంద్ర, గౌతమ్ కాఫీ తాగుతుంటారు..గౌతమ్ ప్రేమలో పడితే ప్రపంచం అధ్బుతంగా కనిపిస్తుందంటారు నిజమేనా అంటాడు. పొద్దున్నే గొప్ప టాపిక్ తీసావన్న మహేంద్ర.. ప్రేమ ఎంత తియ్యనిదో అంతే చేదుగా మారుతుంది, ఏంత నవ్విస్తుందో అంత ఏడిపిస్తుంది అది ఏ ప్రేమైనా సరే అంటాడు. సింపిల్ గా చెప్పాలంటే ప్రేమ సముద్రం లాంటింది గౌతమ్.., బీచ్ లో అలల వరకూ ఆహ్లాదంగానే ఉంటుంది ఇంకా ముందుకెళ్తేనే ప్రమాదాలు జరుగుతాయి అంటాడు. అంకుల్ మీరు సూపర్…నేను చిటికెడు అడిగితే మీరు సముద్రమంత సమాధానం ఇచ్చారంటాడు గౌతమ్. అయినా.. నువ్వు ప్రేమ గురించి ఎందుకు అడిగావో తెలుసుకోవచ్చా అని మహేంద్ర అంటే.. ఏం లేదు ఫ్రెండ్స్ డిస్కషన్ చూసి అడిగా అంటాడు. మహేంద్ర ప్రేమలో పడటం, ఒకర్ని ప్రేమించటం అదే వరం, అదే శాపం అవుతుంది అంటాడు..అన్నట్టూ.. పొద్దున్నే రిషి ఎక్కడకు వెళ్లాడని గౌతమ్ అడగటంతో..రిషి చెప్పింది వినడమే తప్ప మనం అడిగేది చెప్పడానకి ఏం ఉండదు అంటాడు మహేంద్ర. ఇప్పటికీ తన ఆలోచనలు, ఎమోషన్స్ అన్నీ దాచేసుకుంటాడు. సంతోషం-బాధ అన్నీ మనసులో దాచేసుకోవడం అలవాటైపోయిందంటాడు.

రిషి-వసుధార:

కార్లో వస్తున్న వసూ జట్టు..గాలికి జుట్టు ఎగురుతుంటే సర్థుకుంటుంది. హెయిర్ క్లిప్స్ అలాంటివేవో పెట్టుకుంటారు కదా అని రిషీ అంటే.. మీరు రమ్మంటారని అనుకోలేదన్న వసుతో… టై ఇచ్చి జుట్టు ముడేసుకోమంటాడు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నాం అని వసూ అడుగుతుంది. ఎపిసోడ్ అయిపోయింది.

రేపటి ఎపిసోడ్ లో

పెద్దమ్మ విషయంలో తప్పు చేశావ్ వసుధార అంటాడు రిషి. సర్..ఆ రోజు ఏవేవే ఫొటోలు చూపించి ఏదేదో మాట్లాడారు..ఆ రోజు నాతప్పు, జగతి మేడం తప్పు లేదని వసూ చెప్తుంది..ఇంకోసీన్ లో కాలేజీలో జగతి రూమ్ కి వెళ్లిన రిషి…వసుధార గురించి నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నా అంటాడు. ఇన్నాళ్లకి రిషి ఓపెన్ అవుతున్నాడన్నమాట అనుకుంటుంది జగతి.. వసుధారని మీ ఇంట్లోంచి పంపించేయండి మేడం అంటాడు రిషీ. ఆ మాట వసూ కూడా వింటుంది. చూడాలి రిషీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటో. .

Read more RELATED
Recommended to you

Latest news