గుప్పెడతంమనసు ఎపిసోడ్ 257:  ‘శ్రీమతి జగతీమహేంద్ర భూషన్ చెప్పారని చెప్పండి’ అని రిషీతోనే చెప్పిన జగతి-  షాక్ లో వసూ

-

గుప్పెడతంమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ వసూ, జగతీతో వాళ్ల పెద్దమ్మ గురించి చెబుతూ ఉంటాడు. ఆ మాటలకు వసూకి కోపం వస్తూ ఉంటుంది. తల్లి ప్రేమను ముందు పెట్టుకుని కపట ప్రేమను నమ్ముతాడేంటో అన్నట్లు వసూ ఎక్సప్రషన్స్ ఇస్తుంది. రిషీ అసలు ఆపడు..నా ఆత్మబలం, నా ఆత్మబంధువు మా పెద్దమ్మ..తను లేకపోతే ఈ రిషేంద్ర బూషన్ ఇప్పుడు ఇలా ఉండేవాడు కాదు..తెగిపోయిన గాలిపటంలా మారేవాడ్ని అంటాడు. జగతి రిషీమాటలకు బాధపడుతూ ఉంటుంది. ఏం మాట్లాడదు. ఫైనల్ గా రిషీ..వసుధార నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి..నేను ఇన్ని మాటలు ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే దానికి నువ్వే కారణం..నా విజయాల గురించి ప్రస్థావన తెచ్చింది నువ్వే కదా..ఈరోజు నువ్వామాట అనకుండా ఉంటే..నేను ఇన్నీ మంచి జ్ఞాపకాలను మీతో పంచుకునేవాడిని కాదేమో అని మీకు కూడా థ్యాంక్స్ మేడమ్ అని జగతికి చెప్తాడు. నా బాల్యం గురించి నేను ఏదో చెప్తుంటే మీరు చాలా ఓపిగ్గా విన్నారు థ్యాంక్స్ మేడమ్ అంటాడు. జగతి లేస్తుంది.. వసూకూడా లేస్తే..పర్లేదు కుర్చోఅని చెప్పి వెళ్లిపోతుంది.
డోర్ దగ్గరకు వెళ్లి వెనక్కు తిరిగి..నేను మీరు చెప్పింది విన్నందుకు థ్యాంక్స్ చెప్పారు..అలాగే మీరు మీ పర్సనల్స్ విషయాలు నాతో పంచుకున్నందుకు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను..మీరు ఇలాగే జీవితంలో మరన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్..మీ విజయాలు వెనకున్న ఆ స్ర్తీ మూర్తికి నేను చేతులెత్తి నమస్కరించాను అని చెప్పిండి సార్ అంటుంది. మిమ్మల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినందుకు డీబీఎస్టీ ఫ్యాకల్టీ హెడ్  జగతిమేడమ్ చెప్పిందని చెప్పండి కాదు కాదు..శ్రీమతి జగతిమహేంద్రబూషన్ చెప్పారని చెప్పండి అంటుంది. ఆ మాటలకు మనోడికి కోపం ఓ రేంజ్ లో వస్తుంది. వసూ నేనేం అనుకున్నాను..ఇక్కడేం జరిగింది అనుకుంటుంది.
ఇంకోవైపు..మహేంద్ర, శిరీష్ నడుచుకుంటూ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ వస్తారు. అందరు బాగుండాలని ఆలోచించే మేడమ్ గ్రేట్ సార్ అంటాడు శిరీష్… ఇంతలో జగతి వస్తుంది.  జగతి ముఖంలో బాధను మహేంద్ర కనిపెడతాడు.  శిరీష్ కంగ్రాస్ట్ మేడమ్..ఎడ్యూకల్చర్ కాన్సప్ట్ అందరికి నచ్చిందంటకదా అంటూ..కొత్త ఐడియాలు ఉన్నాయ్..నాకు ఒక 5నిమిషాలు టైం ఇస్తారా అంటాడు. జగతి సారీ శిరీష్ మనం తర్వాతా మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్లిపోతుంది. అదేంటి సార్ మేడమ్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు అంటాడు శిరీష్..బిజీగా ఉన్నట్లు ఉన్నారులే అనుకుంటాడు.
ఇంతలో వసూ-రిషీ వస్తారు.. శిరీష్ వాళ్లను కూడా పలకరిస్తాడు..ఏం వసూ మేడమ్ తరుపున కాన్సప్ట్ అదరగొట్టావంటగా అంటాడు. రిషీ..అన్ని విషయాలు ఈ శిరీష్ కి ఎందుకు చెప్తుందో అర్థంకాదు అనుకుంటాడు. మహేంద్ర కూడా ఈ శిరీష్ ఒకడు ఇలా చెప్పగానే అలా అడిగేస్తాడు అనుకుంటాడు. ఇంకేంటి మరి ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకుంటారని శిరీష్ వసూని అడుగుతాడు. వసూకి ఏం చెప్పాలో అర్థంకాదు. నా వైపు నుండి ఇంకా ఏమైనా హెల్ప్ కావాలా, చెప్పు వసూ ఆల్వేస్ సర్వీస్ ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు శిరీష్..ఏం అంటారు రిషీ సార్ అని రిషీని అడుగుతాడు. రిషీ..వసుధారతో టైం అవుతుంది వెళ్దామా అని వెళ్లిపోతారు. పాపం శిరీష్ కి ఏం అర్థంకాదు..ఏంటి సార్ మాట్లాడుతుంటేనే వెళ్లిపోతున్నారు..అ‌వును సార్ మీరొకటి గమనించారా..రిషీసార్ మూడ్, మేడమ్ మూడ్ ఒకేలా ఉంటుంది. ఆలోచనలు ఒకేలా ఉంటాయ్..ఏదో రక్తసంబంధం ఉన్నట్లు అంటాడు. మహేంద్ర.. ఆఫీసర్ సార్..మనం ఇవన్నీ అన్నయ్య క్యాబిన్ కి వెళ్లి మాట్లాడుకుందామా అంటాడు.
ఇటువైపు రిషీ వసూ నడుచుకుంటూ కారు వరకు వెళ్తూ ఉంటారు. రీషీ అన్న మాటలను వసూ తలుచుకుంటుంది. రిషీ ఏంటి కోపమా అంటాడు. మాకెందుకు వస్తాయ్ సార్ కోపాలు, వేరే వాళ్లకి కోపం వస్తే భరించటం, సహించటం తెలుసు మాకు అంటుంది. రిషీ నీ కెందుకు కోపం వచ్చిందో నాకు తెలుసులే..ఒకటి మీ మేడమ్ గారి ముందు నిజాలు మాట్లాడినందుకు, రెండు శిరీష్ తో మాట్లాడనివ్వకుండా తీసుకొచ్చినందుకు అంటాడు. విశ్లేషణ చేయటం మీరెప్పుడు మొదలుపెట్టారు సార్ అంటుంది. ఈ రెండింటిలో దేనికి నీకు ఎక్కువగా కోపం వచ్చిందో కూడా తెలుసు అంటాడు రిషీ..అలా ఇద్దరు వాదించుకుంటారు. రిషీ మాత్రం ఈ రెండింటికి కారణాలు వివరిస్తాను అంటాడు. నాకెందుకు సార్ వివరణలు అంటుంది వసూ. ఏంటీ ఈ పొగరు తేడాగా మాట్లాడుతుంది అనుకుని నువ్వు అడక్కపోయినా చెప్పటం నా ధర్మం అని నేను మీ మేడమ్ రాకముందే ఆ టాపిక్ నేను మొదలుపెట్టాను, ఆ టాపిక్ నీకు నచ్చదు అని తెలుసు అంటాడు. ఎదుటివారికి నచ్చదని తెలిసి కూడా ఎందుకు మాట్లాడటం అంటుంది వసూ.  అది నా తత్వం..ఎదుటి వారికి నచ్చకపోయినా నేను చెప్పాలనుకుంది చెప్తా అని రిషీ అంటాడు. వసూ మరి శిరీష్ తో మాట్లాడుకుండా తీసుకొచ్చినదానికి ఏం చెప్తారు అంటుంది. అది కాలేజ్ , బయట టైంపాస్ కబుర్లు అవసరమా..మనం ఎడ్యూకల్చర్ పనిమీద వెళ్తున్నాం అందుకే తీసుకొచ్చా అంటాడు. అయినా వసూ ఏం మాట్లాడదు. ఏంటి ఏం మాట్లాడవు అని రిషీ అడిగితే..అన్నీ మీరే చెప్తే నేనేం చెప్తాను సార్ అంటుంది. సరే వెళ్దామా అని కారు ఎక్కబోతారు. రిషీ ఇంత చెప్పినా ఈ పొగరు మూడ్ మారలేదు..పొగరికి కోపం వస్తే ఇలా ఉంటుందా..అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అనుకుని కారు ఎక్కుతాడు.
Guppedantha Manasu,
ఇంకోసీన్ లో మీటింగ్ లో ఉన్న జగతి రిషీమాటలను ఆలోచిస్తూ ఉంటుంది.  ఫణీంద్ర ఏవో ఐడియాలు ఇచ్చి వీటిల్లో బెస్ట్ సెలక్ట్ చేయమంటాడు. శిరీష్ జగతి మేడమ్ ఉండగా మనం ఐడియాలు ఇవ్వటం వేస్ట్ అని జగతికి బిస్కెట్లు వేస్తాడు. రిషీ-వసూ ప్లేస్ చూడ్డానికి వెళ్లారుకదా వాళ్లు వచ్చాకా ప్రోగ్రామ్ ఇంకాబాగా ఎలా చేయాలో ఆలోచిద్దాం అంటాడు ఫణీంద్ర.   శిరీష్ మొత్తం వర్క్ నేను చేస్తాను సర్ అంటాడు. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి మాత్రం డల్ గా కుర్చుంటుంది. అది గమనించిన మహేంద్ర..జగతి మేడమ్ ఏమైంది అంటాడు. జగతి ఏం లేదు సార్ అంటుంది. శిరీష్ మేడమ్ మీరు ఉత్సాహంగా ఉంటేనే మేము ఉత్సాహంగా ఉంటాం అంటాడు. ఫణీంద్ర వసూ-రిషీ రాగానే ప్లాన్ చేద్దాం అంటారు .అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.
నెక్ట్స్ సీన్ లో జగతి-మహేంద్ర ఒక దగ్గర కుర్చుంటారు. రిషీ మాటాలను తలుచునే ఉంటుంది జగతి. మహేంద్ర సారీ జగతి అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వసూ మొక్కజొన్న కంకులు తిందాం అంటుంది. రిషీ ఇప్పుడు ఇవి అవసరమా అంటే..వసూ వాటిలో ఉండే పోషక విలువలు చెప్తుంది. రిషీ దన్నం పెట్టి సరే తిందాంలే అంటాడు. వసూ బేరమాడి.. స్వయంగా మొక్కజొన్న కంకులు కాలుస్తుంది. రిషీ అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇద్దరు వచ్చి ఏమ్మా ఒకటి ఎంతకు ఇస్తున్నావ్ అంటారు. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news