గ్యాస్ సిలిండర్ ధర పెంచడం మరియు తగ్గించడం అనేది అంతర్జాతీయ మార్కెట్ లోని ధరల పై ఆధారపడి ఉంటుంది. ఈసారి కూడా గ్యాస్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. అయితే ఈ పెంపుదల నుంచి సామాన్యులకు ఊరట కలిగింది. ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా నలభై మూడు రూపాయలు పెరిగింది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 75 పెరిగిన సంగతి తెలిసిందే.
దీంతో హైదరాబాద్ లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2000 ధ ర కు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1915 కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ. 1736.50 కమర్షియల్ సిలిండర్లను హోటల్ లతో పాటు వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సంగతి తెలిసిందే. ఇక డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోలు ఉంటే కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు ఉంటుంది. ఒక ఇళ్లలో వాడే డొమెస్టిక్ సిలిండర్ ధరలు విషయాలలో ఆయిల్ కంపెనీలు కాస్త కనికరం చూపించాయి. అక్టోబర్ 1న డొమెస్టిక్ సిలెండర్ ధరని పెంచలేదు ఆయిల్ కంపెనీ. కానీ గత నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర ఏకంగా 25 రూపాయలు పెరిగిన సంగతి విదితమే.