గుప్పెడంత మనసు సెప్టెంబర్ 14 ఎపిసోడ్ 242: వసూ మాటలను గుర్తుచేసుకుని మురిసిపోతున్న రిషీ..ఇదే ప్రేమేనా..!

-

గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో చెట్టుకింద కుర్చుని తింటున్న రిషీ.. వంట ఎవరు చేశారు అని అడగటంతో..వసూ టెస్ట్ చూశారు కదా, బాగుంది కదా..ఇంతబాగా ఎవరు చేస్తారు సర్. నేనే చేశాను అంటుంది వసూ. నా వంటల రుచి మీకు తెలియదు సార్ అంటుంది. తెలుస్తుంది లే అని రిషీ అంటాడు. వసూ పెరగన్నం తినటం చూసి..పెరగన్నం అంటే నీకు కూడా ఇష్టమైనా అని అడుగుతాడు. వసూ అవును సార్ అంటుంది. పెరగన్నం తింటే అందం పెరుగుతుంది, గ్లో వస్తుంది అంటారు. అందుకు తింటున్నావా అని అడుగుతాడు. మీరు తినండి సర్, మీకు గ్లో వస్తుంది అని వసూ బాక్స్ ఇవ్వబోతుంది. అవును ఇందాక ఏదో అదులు బదులు అన్నావ్. ఏంటి దాన్ని అర్థం అని అడుగుతాడు. వసూ వివరణ ఇస్తుంది. రిషీకి అప్పుడు అర్థమవుతుంది. అన్నీ నువ్వు ఇలాగే అలోచిస్తావా అని అడుగుతాడు. ఈ సాంబార్ రైస్ కూడా ఇలానే చెల్లుకి చెల్లు అనుకునే తెచ్చావా అని అడుగుతాడు. వసూకి అప్పుడు అర్థమవుతుంది గతంలో అటెండర్ తో బాక్స్ ఇప్పించింది రిషీ అని.. మీరు గ్రేట్ సార్ అని పొగుడుతుంది.

రిషీ నువ్వు సారీలకు, ట్యాంక్స్ లకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నావ్ పొగడ్తలకు కాదు అంటాడు. వసూ ఆరోజు జరిగిన జర్నీ మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది. రీషీ ఏం ఆలోచిస్తున్నావ్ తిను అంటాడు. అలా వాళ్లు తింటూ ఉంటారు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. కట్ చేస్తే.. వసూ ఇంటికి వచ్చేస్తుంది. వసూని చూసిన మహేంద్ర అదిగో వసుధార రాలేదని ఇంతసేపు టెన్షన్ పడ్డావ్ కదా వచ్చేసింది అంటాడు. వసూ హలో సార్ అంటూ మహేంద్రను పలకరిస్తుంది. మీ మేడమ్ పది మాటలు మాట్లాడితే మూడు మాటలు నీ గురించే ఉంటాయ్ అని అంటాడు. వసూ వెళ్లిన పని ఏమైంది అని అడుగుతుంది.

వసూ ఆనందంగా జరిగింది చెప్తుంది. అసాధ్యాలు అని అనుకున్నవి అన్నీ జరిగాయ్ అంటుంది. మహేంద్ర వసూ కచ్చితంగా ఏదో గుడ్ న్యూస్ తోనే వచ్చింది నువ్వు కాస్త కోప్పడకుండా చిరునవ్వు చిందించూ జగతి అంటాడు. వసూ ..రిషీసార్ మీ చేతివంట తిన్నారు, మెచ్చుకున్నారు అంటుంది. జగతి అది నేను చేశాను అని చెప్పి ఉండవ్ కదా, నువ్వే చేశా అని చెప్పి ఉంటావ్ అంటుంది. ఒక మంచి కోసం చిన్న అబద్ధం చెప్పటం తప్పుకాదని మీకు కూడా తెలుసు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో తప్ప మిగతా వాటిల్లో నేను మా రిషీ సార్ తో చాలా నిజాయితిగా ఉంటాను అంటుంది వసూ. జగతి అబద్దాలతో ఆశలు, దూరాల్తో బంధాలు నిలబడవు అంటారు వసూ, నాకు ఇలాంటివి సంతోషాన్ని కలిగించవు అని నిట్టూరుస్తుంది.

మహేంద్ర.. జగతి ప్లీజ్, తనేదో ప్రాజెక్టు పనిమీద వెళ్లి ఆ విషయాలను ఆనందంగా చెబుతుంది అంటాడు. నువ్వు చెప్పు వసూధార నీ కళ్లల్లోనే ఆనందం కనిపిస్తుంది అంటాడు. వసూ సార్, మేము ప్రాజెక్టు పనిమీద వెళ్లినట్లే లేదు. అస్సలు అలిసిపోలేదు. లాంగ్ డ్రైవ్ కి ఏదో పిక్ నిక్ కి వెళ్లినట్లు ఉంది అంటుంది వసూ. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది

ఇటుపక్క దేవయాని రిషీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న భర్తతో ఏమండి పొద్దుననగా వెళ్లాడు రిషీ..ఇంకా రాలేదు, ఈరోజు హాలిడే కదా, ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతుంది. రిషీ చిన్నపిల్లాడు కదా వస్తాడు లే, స్లం విసిట్స్ కి వెళ్లారని తెలిసింది అంటాడు. దేవయాని ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఇంతలోనే రిషీ వస్తాడు. రా రిషీ నీ గురించే అనుకుంటూ ఉన్నాను అని దేవయాని అంటుంది. రిషీ ఎలా ఉంది విజిట్ అని వాళ్ల పెద్దనాన్న అడుగుతాడు. చాలా బాగుంది, వెళ్లక ముందు ఏమో అనుకున్నాను మంచి ఎక్సీపీరియన్స్, ఈ రోజంతా చాలా ఉత్సాహంగా పనిచేశాం అంటాడు. అవును నీ కళ్లల్లోనే తెలుస్తుందని అంటాడు. ఫ్రెష్ అయివస్తాను అని చెప్పి వెళ్తాడు.

దేమయాని విజిట్ కి ఎవరెవరు వెళ్లిఉంటారు అని అడుగుతుంది. ఇంకెవరు రిషీ వసూధార అంటాడు. వసుధార సంగతి సీరియస్ గా తీసుకోవాలి అనుకుంటుంది మనసులో.

వసూ శిరీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటీ వసూ సంగతులు అని అడుగుతాడు. ఊరంతా తిరిగేది నువ్వేకదా అని వసూ అంటుంది. శిరీష్… మీ సీరియస్ సింహం రిషీ సార్ తో వెళ్లావ్ కదా ఎలా గడిచింది అని అడుగుతాడు. నీకు రెండు విషయాలు చెప్పాలి అని రిషీని సీరియస్ సింహం అనకు. ఇంకోటి ఏదైనా అడగాలి అనుకుంటే డైరెక్ట్ గా అడుగు, ఏంటి సంగతులు అని అవన్నీ ఎందుకు అని, శిరీష్ రీషీ గురించి చేసిన మేసేజ్ ను గుర్తుచేసి ఏంటీ ఆ మెసేజ్ అంటు తిడుతుంది. నువ్వేంటి మీ సార్ ని అంటే అంత సీరియస్ అవుతున్నావ్ అంటాడు. నువ్వేంటి ఇలా దయచేసావ్ అంటాడు. నేను మేడమ్ గారి ఆహ్వానంతోనే వచ్చాను. లంచ్ కి రమ్మన్నారు కాకపోతే ఇప్పుడు వచ్చాను. అని నేను కాఫీలు, టిఫిన్లకు కక్రుత్తి పడి రావటం లేదు. నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం పెద్దగా ఫ్రెండ్స్ లేరు. చుట్టాలంటే అభిమానం దగ్గర ఎ‌వరూ లేరు. అందుకే అందరిలోను నేనుండాలి అనుకుంటాను. వసూ నువ్వొస్తే నాకు సంతోషమే కానీ, వీళ్లేంటి వాళ్లేంటి అని ప్రశ్నలు వేయకు. అందరు మనవాళ్లే అనుకో..అంటుంది. శిరీష్ అలాగే అంటాడు. వసూ..శిరీష్ నికొకవిషయం తెలుసా.. అంటూ రిషీ గురించి పొగుడ్తుంది. స్లం ఏరియా విజిట్ లో జరిగింది అంతా చెబుతుంది. ఈ మాటలన్నీ మహేంద్ర వింటాడు. సర్ పెద్ద కాలేజ్ కి ఎండీ కదా అయినా ఎక్కడ కుర్చొమన్న ఫీల్ అ‌వలేదు, సర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటుంది. మహేంద్ర మనసులో..వసుధార నీ మనసులో ఏముందో తెలియదు కానీ..నువ్వు గురుదక్షిణ చెల్లిస్తావ్ అనే నమ్మకం నాకు పెరిగిపోతుంది అనుకుంటాడు.

రిషీ గదిలో ఫ్రష్ అయి వచ్చి బెడ్ పైన ఉన్న కర్చీఫ్ చూసి ఆ సీన్ గుర్తుచేసుకుంటాడు. ఇంతలో అది కిండపడిపోతుంది. వెతికి తీసుకుందాం అని వెళ్లేలోపే కర్చీఫ్ గాలికి వెళ్లి వెళ్లి దేవయాని వచ్చే దారిలోకి వెళ్తుంది. కొంచెం ఉంటే దేవయాని తొక్కబోతుంది. రిషీ పెద్దమ్మ ఆగండి కాలుపెట్టకండి అని చెప్పి కర్ఛీఫ్ తీసి తుడుచుకుంటాడు. దేవయాని ఏంటి రిషీ ఏదో పట్టువస్త్రాంలా తొక్కొద్దు అంటున్నావ్, ఏంటి అది అని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మా అని చెప్పి వెళ్లబోతాడు. దేవయాని నీతో స్లం విసిట్స్ కి ఆ వసుధార కూడా వచ్చిందంటగా అని అంటుంది. అవును పెద్దమ్మా.. నా పీఏ కదా రావాలి అంటాడు. ఆ వసుధార కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుగా అనిపించటం లేదా అని అడుగుతుంది. రిషీ ఏం పెద్దమ్మా, ఎందుకు అలా అన్నారు అని అడుగుతాడు. అలాంటి వాళ్లతో మనకు ఎందుకు, వేరే వాళ్లను పెట్టుకోవచ్చు కదా అని అంటుంది. వసుధార చాలా తెలివైంది అని చెప్తాడు.దేవయాని ఆ జగతి గురించి తీయబోతుంది. రిషీ ఇంట్లో ఆ టాపిక్ ఎందుకు వదిలేయండి అంటాడు. ఎవర్ని ఎక్కడ పెట్టాలో నీకు తెలుసు, అంటూ ఎండలో తిరిగి బాగా అలిసిపోయినట్లు ఉన్నావ్ రెస్ట్ తీసుకో అని పంపిస్తుంది.

రూంలోకి వచ్చిన రిషీ..అంత ఎండలో తిరిగినా కొంచెం కూడా అలసటగా అనిపింలేదే ఏంటీ మ్యాజిక్ అనుకుంటాడు. అలా బెడ్ పై పడుకుని వసుధారతో బైక్ జర్నీని గుర్తుచేసుకుంటాడు. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా, ప్లజెంట్ గా అనిపించింది అనుకుంటాడు. వసూ మాటలను గుర్తుచేసుకుంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో రిషీ వసూమీద కోప్పడతాడు. స్లం ఏరియా విజిట్ లో జరగిదంతా శిరీష్ కి ఎందుకు చెప్పావ్ అని అరుస్తాడు. వసూ శిరీష్ కి చెప్పింది సర్ కి ఎలా తెలిసింది అనుకుంటుంది. జగతిని పిలిచి శిరీష్ రాకపోకలు తగ్గిస్తే మంచిది అంటాడు. జగతి దానికి తెలివిగా ఆన్సర్ ఇస్తుంది. మరి జగతి మాటలకు సీరియస్ సింహం రిషీ ఏం అంటాడో రేపటి భాగంలో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news