గుప్పెడంతమనసు సెప్టెంబర్ 17 ఎపిసోడ్-246: జగతి పై రిషీ కోపం..నోర్ ముయ్ రా..నన్ను డాడ్ అని పిలవకు అని మహేంద్ర ఆవేశం

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర చదివిన వ్యాసంలో కోపం తగ్గించుకోవటం ఎలా అని సింపుల్ గా చెప్పారు అంటాడు. అదిగో నువ్వు మళ్లీ కోపంగా చూస్తున్నావ్ అంటాడు మహేంద్ర. కోపం తెచ్చుకోవద్దు అన్నారు కానీ, కోపంగా చూడొద్దు అనలేదుగా అని..డాడ్ నేను కూడా నిన్ననో మొన్ననో ఒక లైన్ చదివాను అంటాడు. వావ్ ఏంటది అని మహేంద్ర అడుగుతాడు. ఏం లేదు డాడ్..కోపం అనేది బలహీనతకాదు, కోపాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటే ఒక ఆయుధంగా మారుతుంది అని ఎవరో గొప్పాయన చెప్పారు అంటాడు రిషీ. ఇంతలో జగతి ఫోన్ చేస్తుంది. అదికాస్తా.. రిషీ చూస్తాడు. ఫోన్ మహేంద్రకు ఇస్తాడు. మహేంద్ర ఫోన్ మాట్లాడనికి వెళ్తే..కాలేజ్ లో కలుస్తారు కదా మళ్లీ ఈ ఫోనులేంటో అనుకుంటాడు. జగతి..మహేంద్రతో నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది. సారీ జగతీ.. రిషీ పక్కనే ఉన్నాడు, ఇంటికిరానా అంటాడు. వద్దులే కాలేజ్ లో మాట్లాడుకుందాం అంటుంది. సరే అని ఫోన్ కట్ చేస్తాడు. రిషీ దగ్గరకు వచ్చి మాత్రం మహేంద్ర..అయిపోయింది రీషీ..హలో అంటే హలో అన్నాను అంతే..ఏదైనా ఉంటే కాలేజ్ లో మాట్లాడుకుందాం అన్నాను అంతే అంటాడు. ఈ సీన్ భలే కామేడిగా ఉంటుంది. రిషీ నేనడిగానా అని బాయ్ చెప్పి వెళ్లిపోతాడు.

వసూ బ్యాగ్ సర్థుకుంటూ ఉంటుంది. జగతి కాఫీ తెచ్చి ఇస్తుంది. కాఫీ కూడా పక్కన పెట్టేసి బిజీ బిజీగా సర్థుకుంటుంది. కాలేజ్ కి ఇంకా టైం ఉందిగా..ఎందుకు అంత తొందర అని అడుగుతుంది జగతి. నేను కాలేజికి వెళ్లటం లేదు మోడమ్ సార్ వాళ్ల ఇంటికి వెళ్తున్నాను అంటుంది. జగతి ఏంటి వసూ నువ్వు, రిపోర్ట్ తయారు చేశావు బాగానే ఉంది మళ్లీ ఇంటికి వెళ్లాలా అంటుంది. వసూ సార్ ఈ టైంకి కాలేజ్ కి రారు కదా మేడమ్ అందుకే అంటుంది. జగతి చెప్పినా వినదనుకుని మనం చేసే పనులు తప్పోఒప్పో మొదట మనకే తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది.

ఇటుపక్క కాలేజీలో జగతి, మహేంద్ర ఒక దగ్గర కుర్చుంటారు. జగతి రీషీ, వసూ అన్న మాటలను గుర్తుచేసుకుంటుంది. ఏంటి జగతి మాట్లాడాలి అన్నావ్..ఏంటి అని అడుగుతాడు మహేంద్ర. జగతి..రోజురోజుకి వీళ్లిద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది అంటుంది. ఇలా జగతి మహేంద్రలు వసూ, రిషీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్న విషయంలో తేడా జరిగితే రిషీ తట్టుకోలేడు అంటుంది జగతి. వీళ్లిద్దరి మనసులో ఏం ఉందో తెలియదు, అడిగితే చెప్పరు అంటుంది. రిషీ వసుధార ఇద్దరు నాకు రెండు కళ్లులాంటి వారే మహేంద్ర, ఏ కంట్లో నలుసుపడినా నేను తట్టుకోలేను అంటూ మహేంద్ర భుజం మీద వాల్తుంది. అలిసిపోయాను మహేంద్ర.. వీళ్లిద్దరు మధ్య ఈ అతిచనువు ఏ అనార్థాలకు దారితీయకుండా నువ్వే అడుగుముందుకేసి ఆలోచించు మహేంద్ర అంటుంది జగతి..అలానే కాసేపు కుర్చుంటారు. అది కాస్తా మన రిషీ చూసేస్తాడు.

వసూ రిషీకోసం ఫైల్ పట్టుకుని రిషీ ఇంటికి వస్తుంది. దేవయాని చూసి ఏంటో ఈ టైంలో సరాసరి ఇంటికే వచ్చావ్ అంటుంది. రిషీసార్ కోసం అంటుంది వసూ..పనిలేకపోయిన కల్పించుకోవటం ఎంతసేపు నీకు అంటుంది దేవయాని. వసూ సార్ సార్ అంటూ లోపలికి వస్తుంది. మాట్లాడుతునే ఉన్నాను కదే ఇలా లోపలికి వచ్చేస్తావ్..కాలేజ్ పని అయితే కాలేజీలో చూసుకోవచ్చు కదా అంటుంది. మీకు అన్ని విషయాలు అర్థంకావు, మీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను అంటుంది వసూ. దేవయానికి చిర్రెత్తిపోతుంది. నువ్వు ఈ మధ్యదూకుడు పెంచావ్, ట్యూషన్ మాన్పించామ్ అని ఇలా వస్తున్నావా..జగతి బాగానే ట్రైనింగ్ ఇస్తుంది అంటుంది దేవయాని. వసూకి జగతిపేరు తీయటంతో కోపం వస్తుంది. కాలేజ్ పని అని చెప్పాను, రిషీ సార్ కోసం అని చెప్పా మధ్యలో జగతి మేడమ్ పేరు ఎందుకు తీస్తున్నారు అంటుంది వసూ. ఇంట్లోంచి వెళ్లిపోయినా…ఆ జగతి పీడ మాకు ఇంకా పోలేదు, నిన్ను వాడుకుని రిషీకి వల విసరమని చెప్తుందా, రిషీ ఇంట్లో లేడు ఈ ఇంటికి రాకపోకలు తగ్గిస్తే మంచిది అంటుంది దేవయాని. పెద్దవారు మీరు కొంచెం పెద్దరికం నిలబెట్టుకుంటే మంచిది, ఎ‌వరో చెప్తే వినే స్థితిలో నేను లేను అంటుంది వసూ.

ఇదంతా దూరం నుంచి ధరణీ చూస్తూనే ఉంటుంది. దేవయాని వసూ మీద గట్టిగా అరవటంతో సీన్ లోకి ఎంటర్ అయి..పాపం వసూ అంటుంది. దేవయాని నువ్వేంటి మధ్యలో నీ గురించి నాకు తెలుసు,నువ్వు ఆ జగతి ఎప్పుడు వస్తుందా ఎదురుచూస్తున్నావు కదా అంటుంది దేవయాని.

పసివాడ్ని వదిలి వెళ్లిపోయినప్పుడు రిషీని పాపం అని ఆ జగతి అనుకోలేదు మరి అంటుంది దేవయాని. అబద్దాన్ని అందంగా భ్రమలో చూపిస్తున్నారు, ఆ అబద్దాల అద్దం బద్దలైనప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకోండి అంటుంది వసూ. వసుధార చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్, రిషీ నా పెంపకంలో పెరిగాడు అంటుంది దేవయాని. అదే కదా మేడం ప్రాబ్లమ్ అని వసూ అంటే..అది నీకు నీ మేడమ్ కి ప్రాబ్లమ్ నాకు కాదు, రిషీ తెలివైనవాడు కాబట్టే నీ వలలో పడటం లేదు, మహేంద్ర అమాయకుడు కాబట్టే జగతిని నిన్ను నమ్ముతున్నాడు. ఏదో అంటారు, ఏదో చేస్తారు. ఆ జగతిని ఆకాశానికి ఎత్తుతారు. మిషన్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది మీ మిషన్ అంటుంది. మీరు ఇంతకన్నా గొప్పగా ఆలోచిస్తారు అని నేను అనుకోవటం లేదు అని వసూ అంటుంది. అవునులే అనుకోకు..ఇన్నాళ్లు నేను కాలేజ్ విషయాలు పట్టించుకోవటం లేదని మీ ఇద్దరి ఆటలు బాగా సాగుతున్నాయ్..చెప్పు ఆ జగతికి చెప్పు..ఈ దేవయాని అంటే తనకి బాగా తెలుసు, మీ కుట్రలు కుతంత్రాలు నాకు బాగా తెలుసు అంటుంది దేవయాని. కుట్రలు కుతంత్రాలు నాకు తెలుసు అని వసూ అంటుంది. ఏం తెలుసు నీకు , ఏవో కట్టుకథలు చెప్పి ఉంటుంది, రిషీ పేరు చెప్పి ఈ ఇంట్లోకి వచ్చే పనలు మానేయ్ వెళ్లు అంటుంది. అరిచినంత మాత్రానా అబద్ధాలు నిజం కావు, రిషీ సార్ ఏదో ఒకరోజు మీ నిజస్వరూపం తెలుసుకుంటారు అని వెళ్లిపోతుంది.

ఏంటీ చూస్తున్నావ్.. ఈ ఇంట్లో ఉంటూ..ఇక్కడ తింటూ ఆ జగతికి జై కొడతావేంటి నువ్వూ..డ్రైవర్ ని కార్ తీయమని చెప్పు, కాలేజ్ కి వెళ్లి వీళ్ల సంగతేంటో చూస్తాను. ఎంత ధైర్యం తనకు నా ఇంటికొచ్చి నన్నే అంటుందా అని ఆవేశంగా అరుస్తుంది. ధరణీ..అత్తయ్యగారు వసుధారకి, ఈ కుటుంబానికి సంబంధం ఏంటి చెప్పండి అంటుంది. సంబంధం ఆ జగతి కలుపుతుంది. నీకు అర్థంకావటం లేదా అంటుంది దేవయాని. అత్తయ్యగారు మీరు అనవసరంగా ఆవేశంతో కాలేజ్ కి వెళ్తే..పెద్దమావయ్యగారు మిమ్మల్నే అంటారు. ఏదైనా ఉంటే ఇంటికివచ్చాక చెప్పండి..కాలేజ్ లో అందరిముందు ఎందుకు చెప్పండి అంటుంది ధరణి..అది నిజమేలే మీ మావయ్యకూడా జగతిని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ జగతిని ఇలా వదిలేసి ప్రసక్తేలేదు, ఈ ఊరినుంచి శాశ్వతంగా వెళ్లగొట్టే ఆలోచన చేయాలి అని మనసులో అనుకుంటుంది.

కాలేజ్ లో రిషీ..మహేంద్ర, జగతి అలా కుర్చున్న సీన్ గుర్తుచేసుకుని కోపంగా ఉంటాడు. అటెండర్ తో ఫ్యాకెల్టీ హెడ్ మేడమ్ ని పిలువు అంటాడు. జగతి మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి టీచర్స్ కి క్లాస్ చెప్తూ ఉంటుంది. అటెండర్ వచ్చి రిషీసార్ రమ్మంటున్నారు అని చెప్తాడు.అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో ట్విస్ట్ అదిరిపోయింది. రిషీ జగతితో నేను నీ కడుపున పుట్టడం పెద్ద తప్పు అంటూ అరుస్తాడు. ఇంతలో మహేంద్ర నోర్ మూయ్ రా..అంటాడు. రిషీ డాడ్ అంటే నన్ను అలా పిలవకు, ఈరోజు ఇద్దరు మనసుల్ని చంపేశావ్ అని బాధగా అరుస్తాడు మహేంద్ర. జగతి..మహేంద్ర ఏంటి ఇది అని ఏడుస్తుంది. ఇవేవి తెలియని వసూ ఫైల్ పట్టుకుని రిషీ దగ్గరకు వస్తుంది. చూడమని బలవంతం చేస్తుంది. రిషీ ఇప్పుడు కాదు అంటాడు. అయినా 2మినిట్స్ అంటుంది. రిషీ కోపంతో ఫైల్ విసిరేస్తాడు. చూడాలి సోమవారం ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో.

Read more RELATED
Recommended to you

Latest news