గుప్పెడంతమనసు ఎపిసోడ్ 277: వసుధారతో శిరీష్ పెళ్లి అనుకుని రగిలిపోతున్న రిషీ..కొత్తస్కెచ్ వేసిన మహేంద్ర

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్ లో శిరీష్ ఏదో మహేంద్రకు చెప్తాడు. మహేంద్ర వసుధార నువ్వేంమంటావ్, నీకు ఓకేనా, బాగా ఆలోచించి చెప్పు వసుధార అంటాడు. శిరీష్ తనకు కూడా ప్రాబ్లమ్ లేనప్పుడు నాకూడా ఏం ప్రాబ్లమ్ లేదు సార్ అంటాడు. మహేంద్ర మీ ఇద్దరికి ఓకే అయినప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు అంటాడు. అసలు మ్యాటరేంటి అనేది ఇంతవరకూ ఓపేన్ చేయలేదు. అక్కడితే ఆ సీన్ అయిపోతుంది. ఇంట్లో రిషీ రెస్టారెంట్ లో జరిగిన సీన్ గుర్తుచేసుకుంటాడు. మహేంద్రకు కాల్ చేస్తాడు. కారులో వసూ, మహేంద్ర వస్తూ ఉంటారు. వసూ స్పీకర్ ఆన్ చేసి ఇస్తుంది. రిషీ ఫోన్ లిఫ్ట్ చేయగానే..ఎంతసేపు డాడ్ ఫోన్ ఎత్తడానికి, మీ పెత్తనాలు ఇంకా అవలేదా.. అసలు మీకు ఎందుకు డాడ్ ఈ పార్ట్ టైం పనులు, వాళ్లిద్దరూ తెలివైన వాళ్లేకదా, మీ సలహాలు, సూచనలు వాళ్లకు అవసరమా అంటాడు. ఈ మాటలు వింటూ మహేంద్ర ముందుఉన్న వాటిని చూసుకోడు..కొంచెంలో యాక్సిడెంట్ అయ్యేది..వసూ అప్పుడు సర్ సర్ అంటుంది. రిషీ ఏంటి డాడ్ డ్రైవింగ్ లో ఉన్నారా, ఆ వసుధార మీతోనే ఉందా, ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తుంది, పక్కన కుర్చుని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అసలు వినకండి అంటాడు. బాయ్ చెప్పి కట్ చేస్తాడు. ఈ మాటలన్నీ వసూ వింటున్నట్లు మనోడికి తెలియదు. మహేంద్ర కాసేపు రిషీ గురించి మాట్లాడి..నిన్ను ఏదో అన్నాడుగా ఫీల్ అవ్వకూ అంటాడు. అలా ఏం లేదు సార్.. రిషీ సార్ జంటిల్ మెన్ అంటుంది వసూ. నా కొడుకుని పొగడటం నాకు చాలా బాగుంది అంటాడు. అలా ఆ సీన్ అయిపోతుంది.
ఇటుపక్క రిషీ రూంకి దేవయాని వస్తుంది. నీతో మాట్లాడి రిషీ అంటుంది దేవయాని. మీరెందుకు వచ్చారో, ఏం మాట్లాడతారో నేను ఊహించగలను అంటాడు రిషీ. దేవయానికి జగతి టాపిక్ తీయబోతుంది..రిషీ పెద్దమ్మా మీరు అక్కడికి ఎందుకు వెళ్లారనేది నేను అడగను..నాకు నచ్చలేదు..కాలేజ్ వ్యవహారాలను, కాలాజే విషయాలను ముడపెట్టకండి అంటాడు. దేవయాని వెళ్లిపోతుంది. ఏంటో రిషీ నేను హద్దులు పెడదామని వస్తే నాకు హద్దులు పెడుతున్నాడు అనుకుంటుంది మనసులో.
ఇంకోవైపు వసూ రిషీ సార్ కి నా మీద కోపం ఎప్పుడు పోతుందో ఏంటో అని రిషీ ఇచ్చిన నెమెలీకను చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ రిషీ కూడా వసూ గతంలో కాకిఎంగిలి అని ఇచ్చిన కర్చీఫ్ చూసుకుని మురిసిపోతూ…రెస్టారెంట్ లో జరిగిన సీన్ తలుచుకుని అసలు ఏంటి పర్సనల్ డాడ్ అని అడిగితే బాగోదు అని వసూకి మాట్లాడొచ్చా అని మెసేజ్ చేస్తాడు. వసూ రిషీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది..ఆ మెసేజ్ చూసి కాల్ చేయనా అని రిప్లైయ్ ఇస్తుంది. నేనే చేస్తాను అని రిషీ వీడియోకాల్ చేస్తాడు. వసూ ఏంటి సార్ వీడియోకాల్ చేశారు..నార్మల్ కాల్ చేస్తారు అనుకున్మానే అనుకుని లిప్ట్ చేస్తుంది. రిషీ మనసులో రెస్టారెంట్ లో ఆ మీటింగ్ ఏంటి అడగాలా, అడిగితే చులకన అయిపోతానా అనుకుని ఏం చేస్తున్నావ్, తిన్నావా అంటాడు. వసూ తిన్నాను సార్, ఏంటి కొత్తగా అడుగుతున్నారు అంటుంది వసూ..ఏ అడగకూడదా అంటాడు రిషీ. ఇంకా సార్ అంటుంది. రిషీ గుడ్ నైట్ చెప్పి కట్ చేస్తాడు. అరే అడిగితే బాగుండేదోమే అనుకుంటాడు.
కట్ చేస్తే తెల్లారి రిషీ, మహేంద్రలు ఎక్సర్ సైజ్ చేస్తూ ఉంటారు..అలా మహేంద్ర మాటల్లో మాట శిరీష్ కి కూడా ఫిట్ నెస్ మీద బాగా ఇంట్రస్ట్ అని చెప్తాడు. మనోడి మళ్లీ ఆ రెస్టారెంట్ సీన్ గుర్తుకువస్తుంది. డాడ్ ఆ శిరీష్ కి మీరు, ఆ రెస్టారెంట్ లో సలహాదారుడిగా అందించిన అమూల్యమైన సలహా ఏంటో తెలుసుకోవచ్చా అంటాడు రిషీ. మహేంద్ర అదేమంత మ్యాటరే కాదు , పర్సనల్ విషయంలో సలహా ఇవ్వమన్నాడు ఇచ్చా అంటాడు. రిషీ మళ్లీ అదే డాడ్ ఏ విషయంలో సలహా ఇచ్చారు అని అడుగుతున్నాను అంటాడు. మహేంద్ర ఏముంది రిషీ మంచి జాబ్ ఉందా, వయసుకూడా వచ్చిందికదా పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాడు అంటాడు మహేంద్ర. ఇంతకీ వసుధారతో శిరీష్ ఏం మాట్లాడాడో తెలుసుకోవచ్చా అంటాడు రిషీ. ఏం లేదబ్బా..వసుధారతో తన పెళ్లిగురించి మాట్లాడటానికి పిలిపించాడు అంటాడు మహేంద్ర. అంతే రిషీకి ఫీజులు ఎగిరిపోతాయ్, కోపంతో మరి వసుధార ఒప్పుకుందా, వసుధార ఏం మాట్లాడలేదా, అలాఎలా చేసుకుంటుంది, అంతా తన ఇష్టమేనా అంటి గట్టిగా అరుస్తాడు. గతంలో శిరీష్, వసూల మధ్య జరిగిన సీన్స్ గుర్తుచేసుకుంటాడు. అవునులే వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా వాళ్లిష్టం అని కారు దగ్గరకు వెళ్లిపోతాడు.మహేంద్రకు ఫస్ట్ ఏం అర్థంకాదు..ఆ తర్వాత మహేంద్రకు అర్థమవతుంది..నీకు ఇలా అర్థమయిందా..ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉందే..మై డియర్ రిషీ నాకు భలే దొరికావురా, ఈ దెబ్బతో నీ మనసులో ఉన్న మాటను బయటకురప్పిస్తా చూడూ అనుకుంటాడు.
నెక్స్ట్ సీన్ లో అందరూ టిఫిన్ చేస్తుంటారు. పాపం రిషీ ఏం తినకుండా..ఆ పొగరు పర్సనల్ పర్సనల్ అంటే ఏమో అనుకున్నాను శిరీష్ అంటే చెప్పడు, కనీసం వసుధార చెప్పొచ్చుకదా..పర్సనల్ మ్యాటర్ ని మరీ ఇంత పర్సనల్ గా దాచిపెట్టుకుంటారా అనుకుని ఖాళీ గ్లాస్ నే నీళ్లు ఉన్నాయ్ అనుకుని తాగుతాడు. మహేంద్ర చూసి రిషీ ఆ గ్లాస్ లో నీళ్లే లేవు నువ్వు తాగుతున్నావేంటి అంటాడు. రిషీ ఏం తినకుండానే వెళ్లిపోతాడు. ఫణీంద్ర అడిగితే..కడుపునిండిపోయింది అంటాడు. దేవయాని దొరికిందే ఛాన్స్ అనుకుని జగతి, వసుధారలను తిట్టడం మొదలుపెడుతుంది. ఫణీంద్ర ఏంటి ప్రతీది జగతి, వసుధారకు ముడిపెడతావేంటి అని కోపంగా వెళ్లిపోతాడు. దేవయాని మహేంద్రను అంటుంది. రిషీ ఏంటి పరధ్యానంగా ఉన్నాడు..కాలేజ్ ఒత్తిడి తగ్గించవచ్చుకదా అంటే రిషీ ఆలోచించేది కాలేజ్ గురించే అని మనం ఎలా అనుకుంటాం అంటాడు మహేంద్ర. దేవయానికి కోపం వచ్చి చేయికడిగేసి వెళ్లిపోతుంది. అయ్యో అత్తయ్య అని ధరణి అంటే కడుపునిండింది అంటుంది దేవయాని. మహేంద్ర నవ్వుతాడు. ధరణి అత్తయ్యగారికి కడుపునిండలేదు..మండింది మావయ్య అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో మహేంద్ర ఏదో కొత్త నాటకానికి తెరదించుతాడు. ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసుకుని ఇంట్లోనే పడుకుంటాడు. వసూ రిషీ ఫోన్ కి కాల్ చేసి మహేంద్రకు ఇవ్వమంటుంది. రిషీ మహేంద్రకు ఇచ్చేలోపే జగతి ఏమైంది మహేంద్ర, ఒంట్లోబాలేకపోతే నాకు ఒక మాట చెప్పొచ్చుకదా అంటుంది. ఆ మాటలు విన్న రిషీ ఫోన్ కట్ చేస్తాడు. మహేంద్రను ఎంతలేపిన లెగడు. మహేంద్ర కావలనే ఇదంతా చేస్తుంటాడు. మహేంద్రరూంలో చస్ బోర్డుమీద టూసైడ్స్ గేమ్ సెట్ చేసి ఉండటంతో..రిషీ రెండువైపులా మీరే ఆడుతున్నారా అనుకుని చెక్ పెట్టేసి వెళ్లిపోతాడు. మహేంద్ర ఆటఅయిపోలేదు రిషీ ఇప్పుడే మొదలేంది అనుకుంటాడు.. మహేంద్ర ఏం ప్లాన్ వేశాడో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
–Triveni Buskarowthu