గుప్పెడంతమనసు ఎపిసోడ్ 275 : రిషీ- వసూల మధ్య ఉన్న బంధం గురించి వసూకి చెప్పేసిన రిషీ..ఎప్పుడూ నా పక్కనే ఉండాలంటూ రిషీ షరతు

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ బోర్డు పై సారీ సార్ అని రాస్తూ ఉంటుంది. అది చూసిన రిషీ బోర్డు దగ్గరు వెళ్లి ఏం చేస్తున్నావ్ వసుధార అంటాడు. వసూ ఏమైంది సార్ అంటుంది. నేను ఏం రాయమన్నాను, నువ్వేం రాశావ్, ఏమైంది నీకు, ఇంత స్రొహలేకుండా ఉన్నావా అంటాడు. వసూ అది రఫ్ చేయబోతే..రిషీ అక్కర్లేదు అంటాడు. వసూ పాపం డల్ గా నడుచుకుంటూ వచ్చి బ్యాగ్ తీసుకోని వెళ్లిపోబోతుంది.

రిషీ వసుధార ఎక్కడికి అంటే..మీరు ఎలాగో పనిష్మెంట్ ఇస్తారుగా అంటుంది. వీటికేం తక్కువలేదు అంటాడు రిషీ. మరోసీన్ లో దేవయాని అటుఇటు తిరుగుతూ..రిషీ ఇంకా ఇంటికిరాలేదు, వస్తే ఏం అంటాడో, నేను అసలు వెళ్లాల్సింది కాదు, అయినా జగతి ఏంటో అలా ఇరికించేసింది అనుుకుంటా ఉంటుంది. ఇంతలో ధరణి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఏంటలా సడన్ గా ఎదురొచ్చావ్ అంటుంది దేవయాని. ధరణి ఏంటి అత్తయ్యగారు ఏదో టెన్షన్ లో ఉన్నారు అంటే..దేవయాని ఎటకారంగా చెప్పి..నాకు వంద టెన్షలు ఉంటాయ్, అవి అన్నీ నీకు చెప్పాలా అంటూ అరుస్తుంది. ఇంతలో ఫణీంద్ర వస్తాడు. ఏంటి దేవయాని ఎప్పుడూ ధరణికి ఇవ్వటేమేనా నీ పని అంటే..ధరణి అయ్యోమావయ్యగారు అత్తయ్యగారు నాకేం క్లాస్ ఇవ్వటంలేదు, అని చెప్పబోతుంది. దేవయాని అడ్డుపడి అరుస్తుంది. ఫణీంద్ర వెళ్లిపోతాడు. ధరణీని కూడా పంపిస్తుంది.

మరోసీన్ లో వసూ, పుష్పా చెట్టుకింద కుర్చుంటారు. వసూబాగా ఫీల్ అవుతూ ఉంటుంది. పుష్పను పంపిస్తుంది. క్లాస్ లో జరిగిన సీన్ గుర్తుతెచ్చుకుంటుంది. ఇంతలో మహేంద్ర వస్తాడు. వసూ ఫస్ట్ చూసుకోదు..కాసేపటికి చూసి సార్ అంటుంది. నాకు అంతా తెలుసు వసుధార అంటాడు. ఇంటర్వూకూ రానందుకు సార్ కి కోపం వచ్చింది అంటుంది వసూ. కోపం రానందుకు కాదు..నువ్వు అండగాలేవన్నది రిషీని మానసికంగా బాధను కలిగించిందేమో అంటాడు మహేంద్ర. రిషీ దూరం నుంచి చూసి..ఈ పొగరునామీద కంప్లైంట్స్ ఇస్తుందా ఏంటి అనుకుంటాడు. వసూ రిషీ సార్ నాకూ గౌరవం..జగతిమేడమ్ నాకుదైవసమానురాలు అని చెప్తుంది.ఇలా మహేంద్ర, వసూ రిషీ గురించి మాట్లాడుకుంటారు. రిషీకి నువ్వంటే ఏంటో తెలుసుకోవటానికి కొంచెం టైం పడుతుందేమో అంటాడు. ఇంతలో శిరీష్ ఫోన్ చేస్తాడు. నిన్నుపికప్ చేసుకోవటానికి వస్తున్నాను అంటాడు. శిరీష్ ఇప్పుడైనా వద్దు అంటుంది. అయినా ఈ శిరీష్ వినడు వస్తున్నాను అంటాడు. మహేంద్ర ఏమైంది అంటే..శిరీష్ నన్ను ధర్మసంకటంలో నెట్టేశాడు. మీరు నాకు ఒక సలహా ఇవ్వాలి సార్ అంటుంది.

ఇంకోవైపు రిషీ నడుచుకుంటూ వసూను తలుచుకుంటూ వస్తుంటాడు. ఇంతలో శిరీష్ వచ్చేస్తాడు. వసూకి ఫోన్ చేస్తాడు. రిషీ కూడా కారులో ఎక్కి కుర్చుంటాడు.వసూ శిరీష్ కారు దగ్గరువెళ్సి ఎక్కబోతుంది. రిషీ చూసి హారన్ కొడతాడు. వసూ వెళ్తుంది. రిషీ బాగా ఆలోచించాక నువ్వు చెప్పి సారీల్లో కొంచెం న్యాయం అనిపించింది, పదా కారుఎక్కు అంటాడు. ఇటుపక్క శిరీష్ హారన్ కొడతాడు. రిషీ ఓహో ప్రాగ్రామ్ ఫిక్స్ అయిపోయిందా, కాలేజ్ అయిపోయింది కదా కాలేజ్ ఎండీతో నీకేం పని అంటాడు. వెళ్లు నీ చిన్నపటి ఫ్రెండ్ కదా అంటాడు. వసూ అక్కడే నిలబడుతుంది. శిరీష్ హారన్ కొడతాడు. రిషీ వసుధార వస్తావా వచ్చికారుఎక్కు, లేదా వెళ్లు అంటాడు. వసూ శిరీష్ కి చెప్పివస్తాను అని వెళ్తుంది. మళ్లీకలుద్దాం అంటుంది. శిరీష్ ఏదో టెన్షన్ లో ఉన్నట్లు మాట్లాడతాడు..మనం చాలా మాట్లాడుకోవాలనిచెప్పాను కదా నువ్వు ఈ టైంలో రిషీసార్ తో వెళ్లటం అన్యాయం వసూ అంటాడు. అయినా వసూ వినదు. వెళ్లిపోతుంది.

రిషీ, వసూ ఒక ప్లేస్ కి వెళ్తారు. రిషీ ఏమైంది నీకు, సెల్ ఫోన్లో ఆ సారీలేంటి, బోర్డుమీద సారీలేంటి, సారీలకు నిన్ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టాలేమో అంటూ మాట్లాడతాడు. వసూ ఏడుస్తుంది. నువ్వు ఇంటర్వూకి రానందుకు నా మీద మీకు కోపం ఉండొచ్చు అంటుంది. రిషీ ఆరోజు తను ఫీల్ అయింది చెప్తూ ఉంటాడు. నాకూ కోపం వచ్చింది అంటాడు. వసూ రిషీ చేతులు పట్టుకుని ఏడుస్తుంది. రిషీ వసుధార ఏమైంది అంటాడు. వసూ దీనంగా..నేను మనిషినేకదా, తప్పులో ఒప్పులో ఏదో ఒకరోజు జరుగుతాయ్, మీకు కోపం వస్తే నామీద చూపించండి, ఏదైనా అనాలనుకుంటే అనేయండి, నాతో మాట్లాడకుండా ఉండకండి సార్ అంటుంది. వసుధార ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావ్ , నేను నిన్ను ఏమనలేదుగా అంటాడు. నేను అనేది అదే సార్, మీ మౌనాన్ని మించిన శిక్షమరేది ఉండదు సార్ అంటుంది వసూ. రిషీ వసూ గురించి గొప్పగా చెప్పి..మిషన్ ఎడ్యుకేషన్ లో ఈగోలు, వ్యక్తిగత కారణాలు చూపించవద్దు. ప్రాజెక్టులో మనఇందరి కాంబినేషన్ సక్సస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది..నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి, మనది విద్యాబంధం అంటాడు. ఇద్దరు వెళ్లిపోబోతుంటే పక్కనే గల్లిక్రికెట్ ఆడుతుంటారు. ఆ బాల్ సరాసరి వసూకి తగిలేది..రిషీ క్యాచ్ పట్టుకుంటాడు. వాళ్లని పిలిచి మాట్లాడతాడు. ఫైనల్ గా గ్రౌండ్ లేదనేసరికి డీబీఎస్టీ కాలేజ్ లో ఆడుకోమని చెప్తాడు. బాగాచదువుకుని బాగాఆడుకోమని చెప్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.