Asalem Jarigindi Movie Review: టాలీవుడ్ లో తాజాగా నిజజీవితాల ఆధారంగా తెరకెక్కుస్తున్న బయోపిక్స్, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల హావా నడుస్తుంది. అవే ప్రేక్షకుల అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం అసలేం జరిగింది?. ఈ చిత్రం శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించారు. ఈ సినిమాకు ఎన్వీఆర్ దర్శకత్వం వహించాడు.
మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యాడ ఎక్స్ డోస్ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ హర్రర్ మూవీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా తెలుసుకుందాం…
1970- 80 మధ్య గ్రామీణ తెలంగాణలో జరిగిన యద్దార్థ ఘటన ఆధారంగా .. అసలేం జరిగింది? ..సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఓ కనిపించని శక్తితో హీరో ఎలా పోరాడాడు అనేది కథాంశం. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సస్పెన్స్, లవ్ స్టోరీ, హారర్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టైటిల్ నుంచే జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ టైటిల్ తగ్గకుండానే జనాలకు కొత్త అనుభూతి కలిగించింది అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి అవసరం లేదు. అటు సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, యాక్షన్ అన్నింటిని మూవీ మేకర్స మేళవించి.. ప్రేక్షకులకు పుల్ మీల్స్ లా వండించారు.
ఈ సినిమాలో హీరోహీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కామన్ పాయింట్.. జాతకాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి బ్యాగ్ రౌండ్ నేపథ్యంలో తెరకెక్కించారు. కనిపించని ఓ దుష్టశక్తితో హీరో ఎలా పోరాడాడు. తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఉంటే.. ఉర్లో ఏదో ఉపద్రవం వస్తున్నట్టు పుకార్లు నడుస్తుంటాయి. ప్రతీ అమావాస్య నాడు ఏదో తెలియని శక్తి గ్రామాన్ని ఆవరిస్తుందని, అందరూ నాశనం అవుతారని అతీత శక్తుల గురించి తెలిసిన ఓ వ్యక్తి గ్రామస్తులను హెచ్చరిస్తాడు.
ఈ క్రమంలో వరుసగా గ్రామస్థులు అకారణంగా చనిపోతుంటారు. ఈ క్రమంలో గ్రామస్తులు అంతా ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధపడుతారు. కానీ ఈ సమస్యకు మూలాలను అన్వేషించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అమావాస్య రోజున ఓ మంత్రికుడు ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ పై కన్ను వేస్తాడు. హీరోయిన్ ను తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. హీరో హీరోయిన్, ఊరిని అతీత శక్తుల నుంచి రక్షిస్తాడా..? లేదా అన్నది స్క్రీన్ పై చూడండి
అసలేం జరిగింది.. సినిమాను గత ఆరేళ్ల నుంచి ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ‘ఎక్సోడస్ మీడియా’ తొలిసారిగా నిర్మించింది. ఈ మూవీ మేకర్స్ ఏ విషయంలో కూడా తగ్గేదే అన్నట్టు వ్యవహరించారు.
టెక్నికల్ పరంగా.. ఏ మాత్రం లోటు లేకుండా చూసుకున్నారు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, 5.1, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి టెక్నాలజీని వాడరాదు. సినిమా చూస్తున్న సేపు మూవీ మేకర్స్ పనితనం కనిపించింది. ఈ సినిమానే ప్రాణంగా చేసినట్టు అనిపిస్తుంది.
ఈ మూవీకి ఎలేందర్ మహావీర్ మ్యూజిక్ మరో హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ తల్లి చనిపోయినప్పుడూ వచ్చే తల్లి ప్రేమ మీద వచ్చే పాట చాలా అద్బుతంగా ఉంది. సినిమాలోని అన్ని సీన్ కు అనుగుణంగా
ఎస్.చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. అలాగే సేతు స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఈ హార్రర్ మూవీకి కలిసిచ్చాయి. సినిమా మొదలు నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అలాగే.. విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవిక, రాంకీ, భార్గవి పిళ్లై సహా పలువురు పాడిన ఈ సినిమా పాటలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
రాఘవ అలియాస్ ఎన్‌వీఆర్ ఈ సినిమాను సక్సెస్ పుల్ గా తెరకెక్కించారు. ప్రతి సీన్ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతుంది. ఇక నటుడు హీరో శ్రీరామ్ ఫర్మామెన్స్ అద్భుతం.. రోజాపూలు, ఒకరికి ఒకరు సినిమాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీరామ్ ప్రస్తుతం ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన శైలిలో నటించి.. మెప్పించారు. ఆయన నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.
ఓవరాల్ గా అసలేం జరిగింది చిత్రం చాలా బాగుంది. హీరో, హీరోయిన్ల తన పాత్రలకు ప్రాణం పోశారు. మేకింగ్, సౌండ్స్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అందరికీ నచ్చుతాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదని ఈ సినిమా చూసిన వారు ఎవరైనా చెబుతారు.హారర్, థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకు వెళ్లి తీరాల్సిందే. మొత్తంగా ఈ సినిమాకు మేము ఇచ్చే (రివ్యూ 3.5)…