గుప్పెడంతమనసు ఎపిసోడ్ 298: రిషీని హగ్ చేసుకుని ఏడ్చేసిన వసూ..వసూని హత్తుకుని రిషీ అలా..ఇంతలో

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి వసూధారనను ఎలాగోల నచ్చచెప్పి పడుగోబెడుతుంది. జగతీకి మహేంద్ర ఓ సారి కొన్ని చిక్కులెక్కలు విడదీసే ప్రయత్నంలో ఉన్నా అన్న మాట గుర్తుకువచ్చి మహేంద్ర దగ్గరకు వస్తుంది. ఏం జరుగుతుంది మహేంద్ర అని కోపంగా అడుగుతుంది. ఏంటి జగతి అని మహేంద్ర అంటాడు. వసూ పడిపోవటం ఏంటి, రిషీ తీసుకురావటం ఏంటి, ఏం జరుగుతుంది వీళ్ల మధ్య అని సీరియస్ గా మహేంద్రను అడుగుతుంది. మహేంద్ర నన్ను అడుగుతావేంటి నాకేం తెలుసు అంటాడు. నీకు తెలియకుండా జరుగుతుందని నేను అనుకోను, నా దగ్గర దాచటంలేదా నిజం చెప్పు అని జగతి అంటే..నీ దగ్గర దాచాటానికి ఏం ఉంటుంది చెప్పు, ఏదో ఒకటి అర దాచిన అది ఇప్పుడు మాట్లాడుకునే టైం కాదు అని బై చెప్తాడు. సమాధానం చెప్పకుండా వెళ్తున్నావ్ మహేంద్ర అని జగతి అంటే..మళ్లీ మాట్లాడుకుందాం అని మహేంద్ర వెళ్లిపోతాడు.

ఇంట్లో రిషీ వసూ అన్న మాటలనే గుర్తుచేసుకుని..నేను ఇలా అర్థంచేసుకున్నాను, నేను బాధపడ్డాను, తనని బాధపెట్టాను అనుకుని వసూకి కాల్ చేద్దాం అనుకుంటాడు, మళ్లీ వద్దులే పడుకుంటుందిలే అనుకుని జగతి మేడమ్ కి చేద్దాం అనుకుంటాడు..మళ్లీ వద్దులే అనుకుంటాడు. డాడ్ ఇంకా రాలేదా..వస్తే నన్ను కలుస్తాడు అనుకుని తనలో తాను విశ్లేషణ చేసుకుంటాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. రిషీ డాడ్ వసుధారకి శిరీష్ తో పెళ్లి అని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు అని అరుస్తాడు. నేను అలా ఎప్పుడు చెప్పాను అని మహేంద్ర అంటాడు. మీరే కదా చెప్పారు,రాయబారాలు నడిపారు కదా అంటే..ఈ తొందరపాటే వద్దనేది..ఆరోజు నేను ఏం చెప్పానో నువ్వే గుర్తుచేసుకో, నేను ఏమన్నానో నువ్వేం అర్థంచేసుకున్నావ్, ఇందులో ఎవరి తప్పు లేదు, నీ తప్పే ఉంది అని మహేంద్ర అంటాడు. నా తప్పు ఎలా అవుతుంది డాడ్ అని రిషీ అంటాడు. మహేంద్ర జరిగింది, రిషీ ఏం అనుకున్నది చెప్తాడు. అది నీ తప్పు రిషీ, నీ ఆలోచనలు తప్ప, ఆనందం అంటే..మనస్పూర్తిగా బతకటం, ఆనందం కష్టాలు లేకపోవటం కాదు నాన్న, అన్నింటిని ఒప్పుకుని బతకటం మన వసుధారలాగా, నువ్వు అన్ని మనసులోనే అనుకుంటావు, బయటకు చెప్పవు అదే నీతో ప్రాబ్లమ్ అంటాడు మహేంద్ర.

నాతో చెప్పొచ్చుకదా మీరైనా అని రిషీ అంటే..నువ్వు అడిగావా, శిరీష్ ని అడిగావా, వసూని అడిగావా ఎందుకు నువ్వు తప్పుగా ఊహించావు, వసుధారను దారుణంగా క్షోభపెట్టావు, ఎంగేజ్ మెంట్ కి వచ్చావుకదా, లోపలి దాకా వచ్చావు అంట, ఇంకో రెండు అడుగులు వేస్తే ఆరోజే నీకు విషయం తెలిసేది కదా అని మహేంద్ర అంటాడు. ఒక్కమాటైనా మీరు నాకు చెప్పాలి కదా డాడ్ అని మహేంద్ర అడుగుతాడు..ఒక్కమాటన్న నువ్వు వసుధార శిరీష్ ల పెళ్లి అని నువ్వు ఫీల్ అవుతున్నావ్ అని చెప్పావా లేదు, చెప్పకుంటే బాధ ఇలానే పెరుగుతుంది. పోనీ నిజంగానే వసుశిరీష్ ల పెళ్లి చేసుకుందే అనుకున్నాం..నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు, సరే వసుధార ఎవరోఒకరిని పెళ్లిచేసుకుంటే ఏం చేస్తావ్, పెళ్లి చేసుకుంటే ఏంటంట ఏంటంట అని మహేంద్ర గుచ్చి గుచ్చి అడుగుతాడు. రిషీ అలాఎలా చేసుకుంటుంది అంటాడు. నీకేంటి అని మహేంద్ర అంటే..నేను ఏంటాను ఏమీ అనను అని రిషీ అంటాడు.

నువ్వు ఏమి అనవు, అన్నీ మనసులో అనుకుంటావు, రిషీ క్లారిటీగా ఉండాలి, ప్రపంచంలో ఎవరికి క్లారిటీ ఇవ్వకున్నా పర్లేదు..కనీసం నీకు నువ్వైనా క్లారిటీ ఇచ్చుకోవాలి రిషీ..లేకుంటే ఇలాగే తుఫాను పుడుతుంది..ఇప్పటికైనా అర్థంచేసుకో అని వెళ్లిపోతాడు.

మరుసటిరోజు ఉదయం వసూ దగ్గరకు జగతి వెళ్లి ఏం జరిగిందో అడుగుతుంది. వసూ మేడమ్ జరిగిందేంటో మీకు చెప్పాను, నా మనసులో చాలా సందేహాలు మిగిలిపోయాయ్, రిషీ సారు ఎందుకు ఇలా మారారో నాకు కారణం తెలిసింది, ప్రశ్నించాను, కానీ సమాధానం రాలేదు మేడమ్ అంటుంది. ఏం సమాధానం కావాలని జగతి అంటే..రిషీ సార్ శిరీష్ తో నా పెళ్లి అనుకున్నారు అలా ఎ‌వరు చెప్పారో తెలియాలి అని వసూ అంటుంది. జగతి రిషీ మనసులో వసుధార ఉందన్నది నిజం, ఆ నిజం రిషీ ఒప్పుకోడు, ఈ ఇద్దరి ప్రయాణం ఎక్కడివరకూ వెళ్తుందో తెలియదు, వసూ మనసులో ఏం ఉందో తెలియదు, ఇందులో మహేంద్ర ప్రేమేయం ఎంతుందో తెలియదు అనుకుని..నువ్వు అలా వర్షంలో ఉండటం కరెక్టుకాదు అని వసూతో చెప్తుంది.

అలా ఉన్నందుకే కొంత చిక్కుముడి వీడింది అని వసూ అంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను..నాకు నీ మీద ఆప్యాయత ఉంటుంది కానీ, అధికారం ఉండదు కదా అని నువ్వు పాలు తాగు వసూ నేను టిఫెన్ రెడీ చెస్తాను అని వెళ్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో ఉంది అదిరిపోయే సీన్..రిషీ వసూని కలవడానికి జగతి ఇంటికి వస్తాడు. వసూ రిషీని హగ్ చేసుకుని నా మీద కోపం ఉంటే తిట్టండి, నాతో మాట్లాడటం మానేయకండి, నన్ను అపార్థం చేసుకోకండి అని రిషీని పట్టుకుని ఏడుస్తుంది. రిషీకి వైబ్రేషన్స్ స్టాట్ అ‌వుతాయి. తను కూడా హగ్ చేసుకుంటాడు. ఈ సీన్ జగతి చూస్తుందేమో రేపు చూడాలి. ఒకవేళ కలైతే మాత్రం ఎవరూ చూడలేరు.

Read more RELATED
Recommended to you

Latest news