గుప్పెడంతమనసు ఎపిసోడ్ 299: రిషీ గురించి జగతి- మహేంద్రలు మాట్లాడుకుంటే ఎంట్రీ ఇచ్చిన ఇగో మాష్టర్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ రూంలో కుర్చుని వసూ అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి కుర్చుంటాడు. రిషీ ప్రతీసారి అడిగిలోపలికి వచ్చేవాళ్లు ఈసారేంటో అడగలేదు అని రిషీ అంటే..ఎందుకో అడగాలని అనిపించలేదు అంటాడు మహేంద్ర..ఎలా ఉన్నావు రిషీ అని మహేంద్ర అంటే..నేను ఎలా ఉన్నానో కాదు, వసుధార ఎలాఉందోతెలుసుకోండి..మీ ఫ్యాకల్టీ హెడ్ గారికి ఫోన్ చేయండి అంటాడు రిషీ. మహేంద్ర జగతికి ఫోన్ చేయబోతే..మీ ఫోన్ నుంచి కాదు నా ఫోను నుంచి అని రిషీ ఫోన్ ఇస్తాడు. ఎవరు ఫోన్ నుంచి అయితే ఏంటి అని మహేంద్ర అంటే..మీరు ఫోన్ చేస్తే..మీరు మంచి చెడ్డలు అడిగినట్లు, నా ఫోను నుంచి అయితే నేను తెలుసుకున్నట్లు అంటాడు రిషీ. మహేంద్ర దెబ్బకు నోరేళ్లబెడతాడు..నువ్వే డైరెక్టురుగా అడగొచ్చుగా అంటే..నా ఫ్యాకల్టీ హెడ్ తను, మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టరు ఈ మాత్రం బాధ్యతలేదా మీకు అని రిషీ అంటాడు. అసలు వసుధారకు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా అని మహేంద్ర అంటే..ఏం జరిగింది డాడ్..వర్షంలో తడిచింది, ఇంట్లో డ్రాప్ చేశాను అంతే అంటాడు రిషీ.

మహేంద్ర..రిషీ ఆ అమ్మాయి ఎందుకు అంత బాధపడుతుంది, దానికి కారణం ఎ‌వరు అని అడిగితే..నాకేం తెలుసు డాడ్ అంటాడు రిషీ. మనసులో ఒకటి దాచుకుని బయటకు ఒకలా ఉండటం కరెక్టుకాదేమో అని మహేంద్ర అంటే..ఏం అడగాలి అనుకున్నారో అదే అడిగేయండి అని రిషీ అంటే..నువ్వు వసుధారను ఇబ్బంది పెట్టావా అని మహేంద్ర అండుగుతాడు..పెట్టాను, తను నాకు ఒక ప్రత్యేకం అంటాడు రిషీ. ప్రత్యేకం అంటే అని మహేంద్ర అడిగితే..మీ జగతి మేడమ్ తనను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని రిషీ అడిగితే..తనంటే జగతి ఇష్టం కాబట్టి అని మహేంద్ర సమాధానం ఇస్తాడు. ఇదీ అంతే, కాలేజ్ లో అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు వసుధారకే మేడమ్ ఎందుకు ఆశ్రయమిచ్చారు అని రిషీ అంటాడు. వసుధార విషయంలో నీ అభిప్రాయం ఏంటో అదైనా చెప్పు అని మహేంద్ర అడిగితే..చెప్పాను కదా డాడ్..ప్రత్యేకం అని రిషీ అంటాడు. మహేంద్ర మనసులో..రిషీ ఎన్నాళ్లు నిన్ను నువ్విలా మోసం చేసుకుంటావు అనుకుంటాడు. రిషీ కాల్ చేయమని ఫోన్ ఇస్తే..మీ ఇద్దరి మధ్య రాయబారాలు చేయటానికి నేను ఉపయోగపడతానా ఏంటి అని మహేంద్ర అంటే..రాయాబారాలు మీకేం కొత్తకాదు కదా డాడ్, మా స్టూడెంట్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలిగా, అది కూడా కాలెజ్ టాపర్ చేయండి అని ఫోన్ ఇస్తాడు. మహేంద్ర జగతికి ఫోన్ చేస్తాడు.

జగతి అప్పటికే కారులో వెళ్తూ ఉంటుంది. రిషీ నాకు ఫోన్ చేస్తున్నాడా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి జగతి హలో సార్ గుడ్ మార్నింగ్ అంటుంది. ఇటుపక్క మహేంద్ర గుడ్ మార్నింగ్ జగతి మేడమ్..నేను డీబీఎస్డీ కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మహేంద్ర బూషన్ ని మాట్లాడుతున్నాను అంటాడు. జగతి మహేంద్ర ఏమైంది అంటుంది. మేడమ్..మా కాలెజ్ ఎండీగారు, వారి ప్రత్యేకమైన స్టూడెంట్ వసుధార ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఫోన్ చేయించారు అంటాడు మహేంద్ర. జగతి మహేంద్ర సార్..వసుధార ఆరోగ్యం బాలేనందున కాలేజ్ కి రావటం లేదని చెప్పమనండి అంటుంది. ఇంతలోనే రిషీ ఫోన్ తీసుకుని కట్ చేస్తాడు. హే పూర్తిగా చెప్పనివ్వలేదే అని మహేంద్రఅంటే.. అర్థమైంది అంటాడు రిషీ. ఎలా నువ్వు వినలేదుకదా అని మహేంద్ర అడుగుతాడు..నా మనసుకి అర్థమైంది అంటాడు రిషీ. ఆహా..నేను ఇక్కడ ఫోనులో మాట్లాడుతుంటే నీ మనసుకు ఎలా అర్థమవుతుందో అంటే..అది స్టూడెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్న వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది అంటాడు రిషీ. జగతి మేడమ్ ఏం చెప్పారో వినవా అని మహేంద్ర అంటే..అ‌వసరం లేదు, కాలేజ్ కి నేను డైరెక్టుగా వచ్చేస్తాను అంటాడు రిషీ.

ఇంకోవైపు జగతి కాలేజ్ కి వస్తుంది. రాత్రి జరిగింది తలుచుకుంటుంది. వసూని రిషీ అలా రిషీ తీసుకురావటం అవన్నీ. పుష్ప జగతిని వసుధార రావటం లేదా అని అడిగితే..ఈరోజు తను రావటం లేదు అంటుంది జగతి. ఎందుకు రావటం లేదు మేడమ్..ఈరోజు హాల్ టికెట్ తీసుకోవాలి కదా అంటుంది. తను రేపొస్తుందిలే అని జగతి చెప్పి వెళ్లిపోతుంది. క్యాబిన్ లో కుర్చున్న జగతి దగ్గరకు మహేంద్ర వస్తాడు. ఇద్దరూ వసుధార గురించి మాట్లాడుకుంటారు. రిషీ పరిస్థితి కూడా అలానే ఉంది, ఏంటేంటో అంటున్నాడు, ఏం అర్థంకాలేదు అంటాడు మహేంద్ర. జగతి అసలు ఏం జరిగింది, అందులో నీ పాత్ర ఏంత అని అడిగితే.. మహేంద్ర నేను ఏం చేశాను, వాడు వసూ శిరీష్ ల పెళ్లి అనుకున్నాడు..దానికి నేను ఏం చేశాను అంటాడు. జగతి నమ్మదు, నువ్వే ఏదో ప్రయోగం చేశావు అంటుంది జగతి. నీకు తెలియాలి కదా, తెలియకుండా ఎలా ఉంటుంది అని జగతి అంటే..వాడేదో తప్పుగా అర్థంచేసుకున్నాడు అంతేకదా అని మహేంద్ర అంటే..ఇది నీకు చిన్నవిషయమా అని మహేంద్రతో మాట్లాడుతుూ..అసలు తనని ఎప్పుడైనా కరెక్టుగా అర్థంచేసుకున్నావా అని పదేపదే అడుగుతుంది. సరిగ్గా అదే టైంకి, రిషీ ఎవర్ని అర్థంచేసుకోవాలి మేడమ్ అంటాడు. లోపలికి వచ్చి పొద్దున్నే అర్థంచేసుకోవడాలు ఎవరి గురించో తెలుసుకోవచ్చా అని రిషీ అడుగుతాడు.

మహేంద్ర స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ కదా అని ఏదో కవర్ చేస్తాడు. ఇది నిజం అని నేను అనుకోవటం లేదు అని రిషీ అని, జగతితో వసుధారకు ఎలా ఉంది, కాలేజ్ లో కనిపించలేదు అని అడిగితే జగతి తన కాలేజ్ కి రాలేదు, రెస్ట్ అవసరం అని చెప్తుంది. రిషీ మహేంద్రతో డాడ్ నాకు బయటపనుంది నేను వెళ్తున్నాఅని చెప్పేసి వెళ్లిపోతాడు.

ఇంట్లో వసు రిషీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కారులో వస్తున్న రిషీ వసుధారకు ఎలా ఉందో, ఫోన్ చేస్తే బాగుంటుందా అని పరిపరివిధాల ఆలోచిస్తాడు. ఇలా ఆలోచిస్తూనే ఎపిసోడ్ అయిపోతుంది.